పాటల్లో రాజకుమారుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్‌బాబు, సంజన జంటగా షేర్ దర్శకత్వంలో రామ్‌సాయి గోకులం క్రియేషన్స్ పతాకంపై పి.వి.రాఘవులు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఓ రాజకుమారుడు’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు ఆడియో సీడీని విడుదల చేశారు. కార్యక్రమంలో తెలంగాణ క్రీడా సంఘం చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్‌పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగంపల్లి కిషన్ రావు మాట్లాడుతూ- మంచి టైటిల్ పెట్టారు. పాటలు బాగున్నాయి. సమాజానికి మంచి సందేశాత్మక చిత్రాలు అందించాలన్న లక్ష్యంతో ఉన్నారు దర్శకుడు షిరాజ్.. అదే షేర్. ఇదివరకే చక్కటి చిత్రాలను తీసి మంచి పేరు తెచ్చుకున్నాడు. తప్పకుండా ఈ సినిమా సూపర్‌హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ షెరాజ్ ఈసారి మంచి కథతో రాజకుమారుడిని తీసుకొస్తున్నాడు. అలాగే నిర్మాత రాఘవులు సినిమాలపట్ల అంకితభావం వుండే వ్యక్తి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించాలన్నారు. దర్శకుడు షేర్ మాట్లాడుతూ- యూత్‌ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండే చిత్రమిది. దాంతోపాటు చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. మా నిర్మాత ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరపైకి తెచ్చాము. తప్పకుండా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత రాఘవులు మాట్లాడుతూ- నేటి యువతకు మంచి సందేశం ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది. షెరాజ్ భవిష్యత్తులో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకుంటాడు అన్నారు. షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలో విడుదల చేస్తామన్నారు.