పక్కా మణి సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏస్ డైరెక్టర్ మణిరత్నం మళ్లీ మాఫియా బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్న కథ -నవాబ్స్. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్. అరవిందస్వామి, జ్యోతిక, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్‌రాజ్, అరుణ్ విజయ్, ఐశ్వర్యరాజేశ్, త్యాగరాజన్ తదితరులు ప్రధాన తారాగణం. తెలుగు, తమిళంలో సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కార్యక్రమంలో అరవింద్‌స్వామి మాట్లాడుతూ -రోజాలో రిషి, ధ్రువలో సిద్ధార్థ్ అభిమన్యును తెలుగువారు ఆదరించారు. నవాబ్‌లోని వరద క్యారక్టర్‌నీ ఆదరిస్తారని ఆశిస్తున్నా. నా జర్నీని మణిరత్నంతో మొదలుపెట్టాను. సినిమాలకు దూరంగా ఉన్నప్పుడూ ఆయనే నన్ను మళ్లీ స్క్రీన్‌కు తీసుకొచ్చారు. దాదాపు 28 ఏళ్ళ ప్రయాణం మాది. 8 సినిమాలు ఆయనతో అసోసియేట్ అయ్యాను. మణిరత్నంతో ఏ సినిమా చేసినా స్పెషలే, కానీ ఇది మాత్రం సమ్‌థింగ్ స్పెషల్. ఎందుకంటే స్టోరీ చెప్పిన విధానం, అందులోని భారీ తారాగణం.. ఇవన్నీ బాగా బాగా నచ్చాయి. రెహమాన్, సంతోష్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. నవాబ్స్ తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నాడు. దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ -ఈ సినిమా పూర్తిగా టీమ్‌వర్క్. ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేశారు. రచయిత సీతారామశాస్ర్తీ రెండు రాఖీ పాటలు రాశారు. మంచి సంగీతం అందించిన రెహమాన్‌కు ధన్యవాదాలు. కథ మంచి ఆర్టిస్టులు, స్టార్స్‌ను డిమాండ్ చేసింది. అందుకే వాళ్ళతో కలిసి పనిచేశాను. వాళ్లంతా చాలా సరదాగా చేశారు. చాలా సులువుగానే సినిమాను పూర్తి చేశా అన్నారు. ఎఆర్ రెహమాన్ మాట్లాడుతూ -తెలుగులో మాట్లాడుతున్నప్పుడు వినడానికి సొంపుగా ఉంది. వినేకొద్దీ వినాలనిపిస్తోంది. చాలా మంచి లాంగ్వేజ్. మా గురువు మణిరత్నంతో కలిసి పనిచేస్తున్నపుడు, పని చేస్తున్న అలసట తెలీదు. మేమిద్దరం కూర్చుంటే టైమ్ గురించి పట్టించుకోం. తమిళంలో తొలి పాటను విడుదల చేయడానికి ముందు నేను ఒక పాటే చేసిచ్చాను. తర్వాత మరో పాట చేశాను. నేను యూఎస్ ట్రిప్‌లో ఉన్నపుడు, ఓ రూమ్ తీసుకుని అక్కడ ఎక్విప్‌మెంట్ అమర్చుకుని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశా. మణిరత్నం నన్ను నమ్ముతూనే, కావాలంటే అసిస్టెంట్‌ని పంపుతానన్నారు. కాదు, నేను పని చేస్తున్నానని అక్కడ వీడియో తీసి చూపించేవాడిని. అలా సినిమా జర్నీ సరదాగా సాగింది. నవాబ్ -మణిరత్నం పూర్తిస్థాయి చిత్రం. పాటల విషయంలో చిన్న ఛాన్స్ కూడా తీసుకోలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఇంకో పాట పెడదామనిపించింది. అప్పుడు ఇంకో పాట కంపోజ్ చేసి రాఖీ చేత రాయించా. సీతారామశాస్ర్తీగారూ మంచి సాహిత్యం ఇచ్చారని రెహమాన్ వివరించాడు.