రెండున్నర గంటలు నాన్‌స్టాప్ నవ్వులే....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన సినిమా దేవదాస్. సెప్టెంబర్ 27న విడుదవుతున్న సందర్భంగా మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు దర్శక నిర్మాతలు. నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ- మహానటి టైంలో నేను మిమ్మల్మి కలువలేదు. ఈ సినిమా హీరోలు నాకు తోడుగా, అండగా ఉంటూ వాళ్ల భుజాలపై వేసుకుని నడిపించిన సినిమా కాబట్టి మీ ముందుకొచ్చాను. చాలా ఏళ్ల తర్వాత వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన చిత్రమిది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వించే సినిమా అవుతుంది. చక్కటి వినోదంతోపాటు చిన్న సందేశం కూడా సినిమాలో ఉంటుంది. ఈ సినిమా గుండమ్మ కథలా క్లాసిక్ అవుతుందని భావిస్తున్నానన్నారు.
హీరో నాగార్జున మాట్లాడుతూ- అశ్వినీదత్ ఆఖరి పోరాటం అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. ఆయనకు సినిమాపై వున్న పాషన్ ఇంకా అలాగే ఉంది. ఇద్దరు కూతుళ్ల్లు, ఒక అల్లుడు ఇప్పుడాయనకు సహాయంగా వచ్చి చేరారు. ఇక ఈ సినిమాలో నాది డాన్ కారెక్టర్. దాంట్లో వయొలెన్స్ కానీ, మాఫియా యాక్టివిటీస్ కానీ చూపించలేదు. ఎక్కువగా పర్సనల్ లైఫ్ చూపించాం. అందుకే నాకు కూడా కొత్తగా ఉంది. దాస్‌తో వుండే స్నేహమే దేవదాస్ సినిమా. ఒకరిని మరొకరు ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారనేది సినిమాలో మెయిన్ పాయింట్. ఇది ఏదో సీరియస్‌గా తీసిన సినిమా కాదు.. సరదాగా నవ్వుతూ ఉండే సినిమా. సినిమాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నాం.. అందర్నీ బ్యాలెన్స్ చేయడం అనేది దర్శకుడికి ఈజీ కాదు. చాలా ప్రెజర్ ఉంది. ఈ విషయంలో శ్రీరామ్ ఆదిత్య చాలా మొండివాడు. అయితే లేజీ అని ఎందుకు అన్నానంటే నెల రోజుల ముందే సినిమాను చూపించి ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్. మూడు రోజుల ముందు కాపీ చూపిస్తే ఏం చేయలేం. నేను ఎప్పుడూ రాజకీయాల్లోకి వెళ్లను. కేటీఆర్ ఫ్రెండ్‌గానే ఉంటాను అన్నారు.
హీరో నాని మాట్లాడుతూ- దాస్ చాలా ఇన్నోసెంట్. సాఫీగా సాగుతున్న లైఫ్‌లోకి ఊహించకుండా ఎవరూ లైఫ్‌లో చూడని ఓ వ్యక్తి ఫ్రెండ్‌గా వస్తే వాడి లైఫ్ ఎలా మారిపోతుంది అనేది కారెక్టర్. నాగార్జునతో స్క్రీన్ స్పేస్ చేసుకోవడమే అదృష్టం. అలాంటిది ఇప్పుడు ఆయనతో నటించడం అనేది నా అదృష్టం. నచ్చినా నచ్చకపోయినా ఓపెన్‌గా చెప్పేస్తారు. సినిమా అయిపోయిన తర్వాత ఆయన నా గురించి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. మా కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. నా లైఫ్‌లో మోస్ట్ స్ట్రెస్‌ఫుల్ వీక్.. ఎగ్జైటింగ్ వీక్ కూడా ఇదే. బిగ్‌బాస్ ఫైనల్ కూడా ఇదే వారం ఉండటంతో ఒత్తిడి ఉంది అన్నారు.