ఆర్‌టిసి బస్‌లో రైట్ రైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్ అశ్విన్ కథానాయకుడుగా శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ రూపొందిస్తున్న చిత్రం
‘రైట్ రైట్’. మను దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. అరకు, ఒడిశాలలో తొలి షెడ్యూల్, వికారాబాద్‌లో రెండో షెడ్యూల్, మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో చిత్రీకరించామని, ఆర్టీసి బస్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం విభిన్నమైన కథనంతో సాగుతుందని తెలిపారు. మలయాళంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి రూపొందించామని, లవ్ కామెడీ మిస్టరీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కిందని తెలిపారు. బాహుబలి ప్రభాకర్ పాత్ర ఈ సినిమాలో కీలకంగా ఉంటుందని, అందరికీ నచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధవౌతోందని తెలిపారు. నాజర్, షకలక శంకర్, తా.రమేష్, జీవా, రాజారవీందర్, భరత్‌రెడ్డి, పావని, కరుణ, జయవాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జె.బి, పాటలు: శ్రీమణి, కెమెరా: శేఖర్ జోసెఫ్, మాటలు: డార్లింగ్ స్వామి, నిర్మాత: జె.వంశీకృష్ణ, దర్శకుడు: మను.