మొదట ఎన్టీఆర్‌కోసం అనుకున్నా.. ‘ఊపిరి’ దర్శకుడు వంశీ పైడిపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇలా చేస్తే ప్రేక్షకులు ఆదరించరేమో అనే అనుమానాన్ని మనమే ఎక్కువ చేసుకుంటున్నాం. నిజానికి మనం చూపించేది కరెక్టుగా వుంటే వాళ్లు తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు’ అని అంటున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ‘మున్నా’ సినిమాతో కెరీర్ ప్రారంభించి ‘బృందావనం’, ‘ఎవడు’ వంటి చిత్రాలతో స్టైలిష్ మేకర్‌గా పేరుతెచ్చుకున్నాడు. ఆయన తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘ఊపిరి’. నాగార్జున, కార్తి, తమన్నా ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని పివిపి బ్యానర్ పతాకంపై తెరకెక్కుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని రేపు విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా వంశీ పైడిపల్లి తెలిపిన విశేషాలు..
ఆ పాత్రపై సానుభూతి ఉండదు
ఫ్రెంచ్ సినిమా ‘ఇన్‌టచ్‌బుల్స్’ సినిమాను నేను ‘ఎవడు’ సినిమా చేస్తున్న సమయంలో మా కజిన్ చెప్పడంతో చూశాను. దీన్ని మనకు తగ్గట్టుగా మార్చుకుని తీస్తే బావుంటుందనే ఆలోచన కలిగింది. సినిమా మొత్తం ఒక వ్యక్తి వీల్‌ఛెయిర్‌కే పరిమితమైతే అతన్ని చూసి మనకు సానుభూతి కలగదు. అతని ఎమోషన్స్‌తో మనం ట్రావెల్ చేస్తాం.
భయంతో వెళ్లా
ఈ కథను అనుకున్న తరువాత ఈ పాత్రకు నాగార్జునగారైతేనే కరెక్టు అనిపించి ఆయన దగ్గరకు భయంతో వెళ్లా. కథ విన్న తరువాత ఈ సినిమా నేను చేస్తానని చెప్పడంతో షాకయ్యా. నిజానికి ఆయన మూడేళ్ల క్రితమే ఫ్రెంఛ్ సినిమా ‘ఇన్‌టచ్‌బుల్స్’ చూసి ఇలాంటి పాత్రలు చేస్తే బావుంటుందని అనుకున్నారట. కరెక్టుగా నేను అదే తీసుకుని వెళ్లడం నిజంగా డెస్టినీ అని చెప్పొచ్చు. ఆయన చేయకుంటే మాత్రం ఈ సినిమా నేను తీసేవాణ్ణి కాదు.
ముందుగా ఎన్టీఆర్‌ను అనుకున్నా
కథను ముందు ఎన్టీఆర్‌ను అనుకున్నాను. కానీ కథ విన్న తాను కథ బాగుంది కానీ చేయలేనని, డేట్స్ కుదరవని చెప్పారు. ఆ తరువాత ఈ పాత్రకు కార్తి అయితే బాగుంటుందని ఆలోచనతో ఆయన్ను సంప్రదించాను. నిజంగా పాత్రను నిలబెట్టేలా అద్భుతమైన నటనను ప్రదర్శించాడు కార్తి. కొన్ని విషయాల్లో ఆయన డెడికేషన్ చూసి నేనే ఆశ్చర్యపోయా. ఒక స్లమ్ డాగ్ పాత్రలో గొప్ప నటనను కనబరిచాడు.
కథ గురించి..
ఒక బిలియనీర్ జీవితంలో అన్ని సాధించిన వ్యక్తి అనుకోకుండా యాక్సిడెంటల్‌గా వీల్‌ఛెయిర్‌కి పరిమితమవుతాడు. అతన్ని మనసుకు దగ్గరగా చూసుకోవడానికి మరో మనిషి కావాలి. అలాగే బీదవాడైన ఓ యువకుడు కలవడంతో వారి ఇద్దరి జర్నీ ఎలా సాగింది అనేదే ఈ సినిమా. ఇందులో వారిద్దరిమధ్య వున్న బంధం ఎలా ఏర్పడిందనేది అసలు కథ. అంతేకానీ వీల్‌ఛెయిర్‌లో కూర్చున్న వ్యక్తి ఎందుకు అలా అయ్యాడు అనే ఫ్లాష్‌బ్యాక్‌లు గట్రా ఏమీ వుండవు.
గ్యాప్ రావడానికి కారణం అదే
నేను చేసిన సినిమాలకు చాలా గ్యాప్ వస్తున్న మాట వాస్తవమే. నిజానికి అది నేను తీసుకున్నది కాదు. ఒక సినిమా అనుకున్న తరువాత దానికి సవాలక్ష కారణాలు, సమస్యలు ఉంటాయి. వాటన్నింటినీ చక్కబెట్టుకుంటూ సినిమా చేయడానికి టైం పడుతుంది.
తమన్నా కూడా
ఈ సినిమాలో నాగార్జున, కార్తిల పాత్రలకు ఎంత ప్రాముఖ్యత వుంటుందో తమన్నా పాత్ర కూడా అలాంటిదే. ఒకరకంగా సినిమాకు కీ రోల్ అని చెప్పాలి. ఈ పాత్రలో తను అద్భుతంగా నటించింది.
నేను చేసిన సినిమాలన్నీ నాకు ముఖ్యమే
నేను ఈ రోజు ‘ఊపిరి’ సినిమా చేస్తున్నానంటే కారణం, నేను చేసిన గత సినిమాలే. మున్నా సినిమా నా కెరీర్‌ను టర్న్ చేసింది. తరువాత బృందావనం, ఎవడు సినిమాలవల్లే ఇంత గొప్ప సినిమా చేయగలిగాను. నా జీవితంలో చేసిన గొప్ప సినిమా ఇదే అని చెప్పగలను.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతానికి ‘ఊపిరి’ సినిమామీదే దృష్టంతా పెట్టాను. అలాగే అఖిల్‌తో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తరువాత ఆ వివరాలు తెలియజేస్తా.

-శ్రీ