వందో చిత్రానికి సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపించిన నేపథ్యంలో తన వందో చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నట్టు ప్రకటించాడు బాలకృష్ణ. పురాతనకాలంనాటి కథతో తెరకెక్కే సినిమా కావడంతో దానికి సంబంధించిన హావభావాలు, వేషభాషల విషయంలో శిక్షణ తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆయన గుర్రపు స్వారీ కూడా నేర్చుకోవాలని సిద్ధమవుతున్నాడట. అమరావతి నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా భారీగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రారంభిస్తారని, ఏకధాటిగా షూటింగ్ జరుపుతారట. ఇందులో హీరోయిన్లు ఎవరనే విషయం ఇంకా తెలియాల్సి వుంది. బాలకృష్ణ కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కే ఈ చిత్రానికి యోధుడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. త్వరలోనే మిగతా వివరాలు వెల్లడయ్యే అవకాశం వుంది.