బాలీవుడ్‌లోకి ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ క్రేజ్ టాలీవుడ్‌లో ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆయన తాజాగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం ఏప్రిల్ 8న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హిందీలో దాదాపు 800 స్క్రీన్‌లలో విడుదల చేస్తారు. ఇప్పుడు ఈ విషయం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ స్పందిస్తూ‘ సర్దార్ గబ్బర్‌సింగ్ ట్రైలర్ అదిరిపోయింది, ముఖ్యంగా పవన్ స్టైల్ బావుంది. ఇలా నేను కూడా చేయలేనేమో’ అంటూ కామెంట్ చేశారు. ఏదేమైనా పవన్
బాలీవుడ్‌కు వెల్‌కమ్ అంటూ సల్మాన్ చెప్పడం విశేషం.