బండి సాఫీగానే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, రీసెంట్‌గా శైలజారెడ్డి అల్లుడుతో హ్యాట్రిక్ హిట్స్ సాధించిన దర్శకుడు మారుతి. పెద్ద సినిమాలు చేస్తూనే.. చిన్న చిత్రాలకు కానె్సప్టులు ఇస్తూ కొత్త దర్శకులను ప్రోత్సహిస్తున్నాడు. తాజాగా మారుతి కానె్సప్ట్ అందించిన చిత్రం ‘్భలే మంచి చౌకబేరమ్’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కెకె రాధామోహన్ సమర్పణలో వస్తోన్న చిత్రానికి మురళీకృష్ణ ముడిదాని దర్శకుడు, ఆరోళ్ళ సతీష్‌కుమార్ నిర్మాత. చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్న తరుణంలో మీడియాతో మారుతి చిట్‌చాట్.
ప్రాజెక్టు గురించి..?
ఇదొక కానె్సప్ట్ బేస్డ్ ఫిల్మ్. నేను చెప్పిన ఐడియాని రవి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి డైలాగ్స్ రాశారు. ‘రోజులు మారాయి’ టీమ్ సెట్ అయ్యింది. మురళీ డైరెక్టర్, బాల్‌రెడ్డి కెమెరా, జెబి మ్యూజిక్. అందరూ బాగా కష్టపడి పనిచేశారు. దీనికి ఆరోళ్ళ గ్రూప్ సతీష్ స్టోరీ నచ్చి సినిమా తీయడానికి ముందుకొచ్చారు.
కానె్సప్ట్..
కృష్ణానగర్‌లో తిరిగే ఇద్దరు బ్యాచిలర్లకు దేశ రహస్యాలకు సంబంధించిన సీక్రెట్ కవర్ దొరుకుతుంది. వాళ్లు దాన్ని ఎలా బేరమాడారు? అనేది మెయిన్ కానె్సప్ట్. కంప్లీట్ ఎంటర్‌టైనర్. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో మంచి ట్విస్ట్ ఉంది. సెకెండాఫ్ సీరియస్‌గా సాగుతూ కన్‌ఫ్యూజన్ కామెడీతో ఎంటర్‌టైన్ చేస్తుంది. పక్కా కమర్షియల్ ఫిల్మ్. చిన్న సినిమాల కానె్సప్ట్‌లు చాలా బాగుంటాయి. కానీ థియేటర్‌కి ఎవరూ రారు. సినిమాలు చూడాలి అంటే అందులో ఏదో సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండాలి. ఈ చిత్రంలో అలాంటి డిఫరెంట్ పాయింట్, ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంటే కాదు, మంచి మెసేజ్ కూడా చిత్రంలో ఉంటుంది.
నటీనటుల గురించి..
నవీద్, పార్వతీశం హీరోలుగా నటించారు. యామిని భాస్కర్ హీరోయిన్. రాజా రవీంద్ర కీ రోల్‌లో కనిపిస్తారు. త్రోఅవుట్ సినిమా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ముస్త్ఫా అనే కొత్త విలన్ నటించారు. రాధామోహన్ మంచి టేస్ట్‌వున్న నిర్మాత. నా ఫ్రెండ్స్ చాలామంది ఆయన గురించి పాజిటివ్‌గా చెప్పారు. మిత్రుడు శ్రేయాస్ శ్రీను రాధామోహన్‌ని పరిచయం చేశారు. భలే మంచి చౌక బేరమ్’ ఫస్ట్ కాపీ చూసి బాగా ఇంప్రెస్ అయి ఆయన ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా ప్రమోట్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. మా ఇద్దరి జర్నీ స్మూత్‌గా వెళ్తుంది. సినిమాని ప్రేక్షకులు దగ్గరకు తీసుకెళ్లి చూడమని చెప్పడమే నిర్మాత బాధ్యత. అది ఆయన బాగా చేస్తున్నారు. ఇండస్ట్రీలోని వ్యక్తులు ఇద్దరు చూశారు. చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా చాలా బాగుందని అప్రీషియేట్ చేశారు.
చిన్న చిత్రాలు?
లేదండీ! పూర్తిస్థాయిలో నేను పెద్ద చిత్రాలమీదే దృష్టి పెడుతున్నా. ప్రస్తుతం చిన్న చిత్రాలు చేయదల్చుకోలేదు. నా సైకిల్ ప్రయాణం స్మూత్‌గా సాగుతుంది. రాధామోహన్ మా కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది. కథని బట్టి వెళ్లాలనేది నా ప్లాన్. భలే భలే మగాడివోయ్ తరహాలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నెక్స్ట్ సినిమా చేస్తాను.