రాజకీయాల్లోకి లాగకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ దేవరకొండ. ప్రస్తతం టాలీవుడ్ మోస్ట్ సెనే్సషనల్ స్టార్. అతనితో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. మొన్న అర్జున్ రెడ్డి హిట్. నిన్న గీత గోవిందం హిట్. ఆ ఊపులో తాజాగా వస్తోన్న నోటా. తెలుగు తమిళ భాషల్లో శుక్రవారం విడుదలవుతోంది. సక్సెస్ రేస్‌లోవున్న విజయ్ మీడియాతో చిట్‌చాట్.
బాబు బాగా బజీ అనుకుంటా?
మొన్ననే గీత గోవిందం సినిమాకు ప్రమోషన్స్ చేశా. దాని తరువాత ఇప్పుడు నోటాకు ప్రమోషన్స్. బాగా అలసిపోయాను. రేపు ఒక్కరోజుతో ప్రమోషన్స్‌కు స్వస్తి చెబుతా. తరువాత రిలాక్స్ అవ్వాలని ఉంది. కానీ, వెంటనే డియర్ కామ్రేడ్ ఉంది. నో రెస్ట్.
ఇంత బిజీని ఊహించారా?
బిజీ అంటే సినిమాలు చేయాలి అనుకున్నాను. కానీ, ఇలా నిద్రలేని రాత్రులు గడుపుతాను అనుకోలేదు. ఒక్కరోజులో 8 లేదా 9 వీడియో ప్రమోషన్స్ చేస్తున్నా. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలా తిరగడంతో చాలా అలసిపోతున్నా.
విజయ్ సినిమా అంటేనే సంచలనమా?
అదే నాకూ అర్థం కావట్లేదు. నన్ను ఎందుకు లాగుతున్నారో తెలియడం లేదు. నన్ను వదిలేయండి ప్లీజ్. ఎవరైతే ఈ కాంట్రవర్సీ చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో వారినే అడగండి. నన్ను లాగకండి.
మీ సినిమాలు లీకయ్యాయి కదా?
గీత గోవిందం విడుదలకు రెండు రోజులు ముందు సినిమా అంత లీక్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు టాక్సీవాలా చిత్రం లీక్. దాదాపు ఏడాదిన్నర ఈ చిత్రాలకు సమయం కేటాయించాను. ఇలా లీక్ అయితే పరిస్థితి ఏమిటో అర్థంకావడం లేదు. నిజంగా ఆ టైంలో ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి. పైరసీ అన్నది చాలా కాలంనుంచి ఉంది. సినిమా విడుదల తరువాత రెండు రోజులకో.. మూడు రోజులకో లీక్ అయితే ఫరవాలేదు. కానీ, విడుదలకు ముందే లీకైతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అలా లీక్ చేసిన వారిని క్షమించొద్దు.
నోటా చాలా రియలిస్టిక్ పొలిటికల్ మూవీ. సన్నివేశాలు రియల్‌గా అనిపించడమే కాదు, ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలను గుర్తు చేస్తాయి. నాకు పొలిటికల్ నాలెడ్జి అంతగా లేదు. కానీ సినిమా కోసం తెలుసుకున్నా. అందుకే పొలిటికల్ స్టోరీ ఎంచుకున్నా. లవ్‌స్టోరీ ఎప్పుడైనా చెయ్యొచ్చు కానీ ఇలాంటి పొలిటికల్ స్టోరీ దొరుకుతుందో లేదోనని ఇంకా కొత్తగా చేద్దామని చేశాను.
అమ్మాయితో ఫొటో గురించి?
ఆ ఫొటోలో వున్నది నేనే. అది మార్ఫింగ్ చేశారు. ఆ చిత్రం నాదికాదని చెప్పను. ఆ ఫొటో రెండేళ్ల క్రితానిది. ఆ అమ్మాయి చాలా మంచిది. మీరు ఈ విషయాన్ని తొందరగా మర్చిపోవాలని కోరుకుంటున్నా.
రాజకీయాలపై అభిప్రాయం?
వాటి గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. మన గురించి పట్టించుకోని నాయకుల గురించి అందరూ ఎలా స్పందిస్తారో నేను అలాగే స్పందిస్తా. రోడ్డు బాగుండాలి, డ్రైనేజీ సిస్టం బాగుండాలి, నీళ్లు రావాలి- ఇలాంటి అన్ని విషయాలు పట్టించుకోవాలి. ప్రజలకు మంచి చేసేవాళ్లంటే నాకు ఇష్టం.
ముఖ్యమంత్రి అప్పీరెన్స్?
అది సినిమా చూసి మీరే చెప్పాలి. కథలో నా పాత్ర కల్పితం. అక్కడి రాజకీయాల్లోకి నా పాత్రను ఎంట్రీ ఇస్తే ఎలా వుంటుంది. ఓ కామన్‌మాన్ రాజకీయాలంటే ఎలాంటి అవగాహన లేని యువకుడు రాజకీయాల్లోకి వస్తే ఎలావుంటుందో అదే ఈ సినిమా. ఇది మన అందరి కథ.
భవిష్యత్తులో రాజకీయాలోకి వస్తారా?
నాకు రాజకీయాలంటే తెలీదు. ప్రస్తుతం హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నా. నన్ను వదిలేయండి.. ప్లీజ్!
సొంత బ్యానర్‌లో..?
తప్పకుండా చేస్తా. కింగ్ ఆఫ్ ది హిల్ అనేది నా బ్యానర్. అంటే దేవరకొండలోని అర్థం వచ్చేలా పేరుని ఇలా మార్చేశా. పెళ్లిచూపులు సమయంలో ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డామో మాకు తెలుసు. టాలెంట్ వున్న దర్శకులకు అవకాశం ఇద్దామని పెట్టాము.
తదుపరి చిత్రాలు?
డియర్ కామ్రేడ్ షూటింగ్ జరుగుతుంది. క్రాంతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నా. అలాగే ఇంకో ద్విభాషా చిత్రం చేయాల్సి వుంది. కానీ నోటా టాక్ తర్వాత ద్విభాషా సినిమా చేయాలా? వద్దా? అన్నది అప్పుడు నిర్ణయించుకుంటా.

-శ్రీనివాస్ ఆర్.రావ్