తనదైన ‘ముద్ర’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిరాక్ పార్టీ చిత్రం తరువాత యువ హీరో నిఖిల్ నటిస్తున్న చిత్రం ‘ముద్ర’. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో జరుగుతుంది. షెడ్యూల్ తరువాత పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తిచేసి సినిమాను నవంబర్ 8న విడుదల చేయనున్నారు. తమిళ దర్శకుడు టిఎస్ సంతోష్ తరెకెక్కిస్తున్న చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తమిళ్‌లో విజయం సాధించిన ‘కనితన్’ సినిమాకి రీమేక్. ఠాగూర్ మధు నిర్మిస్తున్న చిత్రంలో నిఖిల్ సరసన లావణ్యత్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ యువ సంగీత దర్శకుడు సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే చిత్రం టీజర్ విడుదల తేదీని ప్రకటించనున్నారు.