మళ్లీ.. షకలక హీరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ కమెడియన్ ‘షకలక’ శంకర్ హీరోగా ఎస్‌కె పిక్చర్స్ సమర్పణలో రూపుదిద్దుకున్న చిత్రం ‘శంభో శంకర’. నిర్మాతల్లో ఒకరైన సురేశ్ కొండేటి ఇటీవలే మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’నూ తెలుగులో ‘జనతా హోటల్’ పేరిట తీసుకొచ్చారు. తాజాగా సురేశ్ కొండేటి మరో రెండు సినిమాలను ప్రకటించాడు. ‘షకలక శంకర్’ హీరోగా మరో సినిమాను తెరకెక్కించనున్నట్టు ప్రకటించాడు. ‘శంభో శంకర’కు దీటుగా అన్ని కమర్షియల్ హంగులను రంగరించి సినిమా ఉంటుందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోందని వెల్లడించారు. మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళబోతోందన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత రాజకీయ వాతావరణ ప్రతిబింబించేలా సంచలనాత్మక చిత్రానికి సురేశ్ శ్రీకారం చుట్టబోతున్నారు. తెలుగులో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎన్నో సినిమాలొచ్చినా, వాటికి భిన్నమైన కథనంతో స్ఫూర్తిదాయక చిత్రం చేయబోతున్నట్టు పేర్కొన్నారు. వీటికి సంబంధించి కథాచర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.