ముద్దంటే.. సల్మాన్‌కు చేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య ఏ సినిమాలో చూసినా మూతి ముద్దులు ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అవసరం వున్నా లేకున్నా ఈ లిప్ లాక్ సీన్స్ ఆగడంలేదు. దానికితోడు హీరోయిన్ మితిమీరిన గ్లామర్ ఎక్స్‌పోజింగ్, రొమాంటిక్ సీన్స్ సినిమాల్లో కామన్ అయ్యాయి. ఈ ముద్దుల హంగామా బాలీవుడ్ చిత్రాల్లోనే ఎక్కువ. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ సెటైర్ వేసేశాడు. ఈ విషయంపై బిటౌన్‌లో నానా రచ్చ నడుస్తోంది. హిందీ సినిమాల్లో మితిమీరిన శృంగారం, లిప్‌లాక్‌లు గ్లామర్ డోస్‌లపై సల్మాన్ స్పందించాడు. కేవలం లిప్‌లాక్‌వల్ల సినిమాలు హిట్టవ్వవు. అందాలు ఆరబోయడం, శృంగారంలాంటి అంశాలు కాదు.. అంటూ కామెంట్ చేశాడు. ముద్దు సన్నివేశాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని చెప్పేశాడు. నిజమే, సల్మాన్ ఖాన్ తన 29 ఏళ్ళ కెరీర్‌లో ఏనాడూ సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. సినిమా ఫ్యామిలీతో కలిసి చూస్తున్నపుడు తల దించుకునేలా ఉండకూడదని అన్నాడు. ఓసారి ఓ ఆంగ్ల సినిమా సమయంలో ఇలాంటి పరిస్థితి తనకు ఎదురైందట. అందుకే అలా తన సినిమాల్లో ఉండకూడదని ఫిక్స్ అయ్యాడు. ఇక బాలీవుడ్ బాద్షా కూడా తన సినిమాల్లో ఎప్పుడూ లిప్‌లాక్ సీన్స్ చేయలేదు. ఈమధ్యే కత్రినాతో కలిసి జబ్ తక్ హై జాన్‌లో ఒక్క సీన్‌లో నటించాడు.