ప్రియాంక.. డేటింగ్ సర్వీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ క్రేజీ గాళ్.. ప్రియాంకా చోప్రా త్వరలోనే వివాహం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నిక్‌తో డేటింగ్ చేస్తున్న బక్కపల్చని బ్యూటీ, ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకుని సెటిలవ్వాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఇటీవల బలంగా వినిపిస్తోన్న మాట. ఇదిలావుంటే, ప్రియాంక ఇటు బిజినెస్ ఫీల్డ్‌లోకీ ఎంట్రీ ఇవ్వాలని సన్నాహాలు చేసుకుంటోందట. ఓ కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆమె ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని పరిశ్రమనుంచి బలంగా వినిపిస్తోన్న మాట. అదే -డేటింగ్ బిజినెస్. బంబుల్ అనే డేటింగ్ యాప్ ద్వారా బిజినెస్ జరుగనుందని, దీనికి సంబంధించి అమెరికా కోడింగ్ స్కూల్ సంస్థలో పెట్టుబడి పెట్టిందని వినిపిస్తోంది. లింగ వివక్షలేని మెరుగైన సమాజం కోసం ఈ వ్యాపారంలోకి దిగానని ప్రియాంక చెప్తోంది. ‘ఇది నా కల. యాప్‌తో మహిళలకి ఫస్ట్ చాన్స్’ అంటోంది కూడా. మొత్తానికి ప్రియాంక యాప్ బిజినెస్ ట్రేడ్ వర్గాల్లో కలకలం రేకెత్తిస్తోంది.