6న ‘హలో గురు’... ఆడియో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రం షూటింగ్ తుది దశకు చేరింది. ఇటీవల విడుదలైన చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో, చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఇక చిత్రం ఆడియో విడుదల వేడుకను 6న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరుపనున్నారని సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి వుంది. ‘నేను లోకల్’ దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ప్రేమించిన అమ్మాయి కోసం హీరో ఏంచేశాడు? అనే కథతో తెరకెక్కుతున్న చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకురానుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రానున్న చిత్రంపై రామ్, అనుపమా భారీ ఆశలే పెట్టుకున్నారు.