ఈ హ్యాపీ.. కంటిన్యూ అవుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవదాస్ టీం హ్యాపీగా ఉంది. నాగార్జున, నాని కలిసి నటించిన ‘దేవదాస్’ మంచి టాక్‌తో నడుస్తుండటమే ఆ హ్యాపీకి కారణం. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందిన చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. దేవదాస్ సక్సెస్ మీట్‌లో నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ ‘పరిశ్రమలో హీరోలనే నమ్ముకున్నా. వాళ్లవెంటే నడిచాను. వైజయంతీ సంస్థ విజయబావుటాలో వాళ్లదే అగ్రభాగం. అందుకే హీరోలను అభిమానించే నిర్మాతగా.. ఎక్కువ మల్టీస్టారర్ చిత్రాలు నేనే చేశాను, చేస్తున్నానేమో’ అన్నారు. చిత్రానికి విజయం చేకూర్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలపుతూ, సంస్థలో ఎక్కువ సినిమాలు చేసిన స్నేసితుడు నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటకలో తొలిసారి వారంలో 2.37 కోట్ల షేర్ సాధించిన సినిమా ఇదేనన్నారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ నిర్మాత ఇచ్చిన అవకాశం, హీరోలు నాగార్జున, నాని సహకరించిన విధానంతోనే ధైర్యంగా ముందుకు నడవగలిగానన్నారు. నాగ్ ఫ్యాన్స్‌నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇంకా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశాడు. నాగార్జున మాట్లాడుతూ ఫ్యామిలీతో హాలీడే ట్రిప్‌లో ఉన్న కారణంగా ఇక్కడి హ్యాపీయెస్ట్ మూమెంట్‌ని మిస్సయ్యానన్నారు. నిర్మాత దత్తు కలెక్షన్ ఫిగర్స్ చెబుతుంటే హ్యాపీ అనిపించిందని, వారంలో 41 కోట్ల గ్రాస్ చేయడం ఆనందకర విషయమన్నారు. సినిమాను సరదాగా చేసేశాం. మా కెమిస్ట్రీని బ్రొమాన్స్ అంటూ చలోక్తులూ పుట్టుకొచ్చాయి. సినిమా సక్సెస్‌తో మా హ్యాపీ రెట్టింపైంది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు మంచి ఫ్యూచర్ ఉంటుందన్నారు. 45 ఏళ్లు పూర్తి చేసుకున్న వైజంయంతీ వందేళ్ల పరుగులు తీయాలని ఆకాంక్షించారు.