తెరపైకి ఘంటసాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సినిమాకు బయోపిక్ పీవర్ పట్టుకుంది. సినిమా చరిత్రలో బయోపిక్ ఓ ట్రెండ్‌గా మారుతోంది. ప్రేక్షకుల అభిరుచి మేరకు దిగ్గజాలను తెరకెక్కించే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. నిజ జీవిత పాత్రలతో వస్తోన్న సినిమాలను ప్రేక్షకులు అక్కును చేర్చుకుంటుండటంతో, ట్రెండ్‌ను కంటిన్యూ చేసేందుకు మేకర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. ఒక సామాన్యుడు ఒక లక్ష్యం ఏర్పరచుకొని దాన్ని సాధించడం కోసం పడిన కష్టం, ఎదుర్కొన్న ఆటుపోట్లు, జీవనశైలికి కొంత నాటకీయతను జోడిస్తూ చూపిస్తోన్న తీరును ప్రేక్షకుడు ఆదరిస్తున్నాడని చెప్పడానికి ఇటీవల సక్సెస్ అందుకున్న బయోపిక్‌లే నిదర్శనం. వీటిలోని సౌలభ్యాన్ని కూడా మేకర్లు అనుకూలపర్చుకుంటున్నారు. ప్రజాదరణ పొందిన వ్యక్తుల జీవిత కథ దాదాపుగా ప్రేక్షకుడికి తెలిసే ఉంటుంది కనుక, దాన్ని దృశ్యరూపంగా మలచడంతో సులువుగా కనెక్టవుతారన్నది తాగాగా వస్తోన్న బయోపిక్‌ల్లోని సారాంశం. దిగ్గజ వ్యక్తుల జీవిత కథలకు లోతైన అంశాలు, పట్టున్న దృశ్యాలు, వీనుల విందైన స్వరాలు జోడిస్తే ప్రేక్షకుడిని కట్టిపడేయడం ఖాయం. ఇంతవరకు చరిత్రకారులు, క్రీడాకారులు, నటుల జీవిత చిత్రాలనే చూశాం. మొన్నటి దంగల్, నిన్నటి మహానటి ఎంత ఘనవిజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘మహానటి’కి మంచి ఆదరణ లభించటంతో, మహాగాయకుడు ఘంటసాలనూ తెరకెక్కించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. తెరవెనుక స్వరంతో ఎన్నో సినిమాలను హిట్ చేసిన ఘంటసాల బయోపిక్ తెరకెక్కబోతోందన్న మాట. సుస్వరాల ఘంటసాల వ్యక్తిగత జీవితం కొందరికే తెలుసు. ఆయన జీవితం పూలబాట కాదని, ముళ్లబాటలో నడిచి మనకి పూల పాటలు అందించాడని చెప్పడమే బయోపిక్ పరమార్థం. కృషితో నాస్తి దుర్భిక్షం, వినయంతోనే విద్య ప్రకాశిస్తుందని చెప్పడం కంటే ఘంటసాల చూపించాలన్న ఆలోచన బయోపిక్‌కు కారణంగా కనిపిస్తోంది. అన్యుక్తరం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మీ నీరజ నిర్మాతగా, గాయకుడు జివి భాస్కర్ నిర్మాణ సారథ్యంలో రానున్న చిత్రానికి సిహెచ్ రామారావు రచనా దర్శకత్వం వహించారు. చిత్రం రీరికార్డింగ్ ముగించుకొని డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. బాహుబలి కెమెరామెన్ సెంథిల్‌కుమార్ శిష్యుడు వేణువాదనల చిత్రానికి కెమెరామెన్. ఎడిటర్‌గా క్రాంతి, ప్రఖ్యాత స్వరకర్త సాలూరి కుమారుడు వాసూరావు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మహాగాయుడు ఘంటసాల పాత్రను వర్థమాన గాయకుడు కృష్ణ చైతన్య పోషించాడు. ఘంటశాల సతీమణి సావిత్రి పాత్రను కృష్ణచైతన్య భార్య, యాంకర్ మృదుల పోషిస్తుంటే, ఘంటసాల గురువు పట్రాయని సీతారామశాస్ర్తీ పాత్రను సుబ్బరాయశర్మ చేస్తున్నారు. చిత్రం ఫస్ట్‌లుక్‌ని శనివారం హైదారబాద్‌లో ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. చిత్రానికి సంబంధించిన టీజర్‌ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.