లేడీ డాన్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ హాట్ భామ దీపికా పదుకొనె మరోసారి మహిళా ప్రాధాన్యమున్న చిత్రానికి సిద్ధమవుతోంది. ఇటీవలే పద్మావతిగా మెప్పించి, బాక్సాపీస్ వద్ద సంచలన విజయం అందుకున్న దీపిక, నటిగానేకాదు గ్లామర్ విషయంలోనూ తనకు తానే సాటి అని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. కొత్త ప్రాజెక్టులో భాగంగా పద్మావతికి పూర్తి వైవిధ్యమైన చిత్రంలో లేడీ డాన్ పాత్ర పోషించేందుకు రెడీ అవుతోందన్నది ఇండస్ట్రీ టాక్. ఆ డాన్ ఎవరో కాదు.. స్పప్నా దీదీ. దర్శకుడు విశాల్ భరద్వాజ్ సిద్ధం చేస్తున్న స్వప్నా దీదీ పాత్రకు దీపికను ఎంపిక చేసుకున్నాడు. వాస్తవానికి షూటింగ్ ఇప్పటికే మొదలుకావాల్సివున్నా, కీలక పాత్ర పోషిస్తోన్న ఇర్ఫాన్‌ఖాన్ అనారోగ్యం కారణంగా వాయిదా పడిందని అంటున్నారు. దీపిక తాజా ప్రాజెక్టుకు సైన్ చేయడంతో, సినిమాలకు పులిస్టాప్ పెట్టి రణవీర్‌తో పెళ్లికి సిద్ధమైందంటూ బిటౌన్‌లో నిన్నటి వరకూ వినిపించిన కథనాలు ఆగిపోవడం గమనార్హం.