సమంత... న్యూ టర్న్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యు టర్న్ చిత్ర ఫలితం సమంతలో గొప్ప మార్పు తెచ్చినట్టుంది. అందుకే -లేడీ ఓరియెంటెడ్ చిత్రాల విషయంలో యు టర్న్ తీసుకున్నానని చెబుతోంది. తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సమంత -మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు చేసి కొత్త ఇమేజ్ సాధించాలని అనుకుంది. వైవాహిక జీవితంలోకి వచ్చేసింది కనుక -స్టార్ హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఒకింత తటాపటాయించింది. కోలీవుడ్‌లో నయనతార తరహాలో భిన్నమైన స్క్రిప్ట్స్‌తో సినిమాలు చేయాలన్న ఆలోచనలో భాగంగానే, కన్నడలో సూపర్ హిట్టయిన యూ టర్న్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసింది. నిజానికి సినిమాపై సమంత పెద్ద ఆశలే పెట్టుకున్నా, ఫలితం రివర్సవ్వడం తెలిసిందే. తెలుగులో సినిమాకు హిట్ టాక్ వచ్చినా, వసూళ్లుపరంగా నిరాశ మిగిలింది. ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సతా చాటుకోలేదు. అటు తమిళంలోనూ పరిస్థితి అంతే. తెలుగు, తమిళ భాషల్లో ఫలితం వికటించటంతో, సమంత సైతం తన నిర్ణయంపై యు టర్న్ తీసుకుందట. ఇకపై కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రలు చేసేది లేదంటూ తీర్మానించుకుందని అంటున్నారు. మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ తెలుగులో అనుష్క, తమిళంలో నయనతార దూసుకుపోతున్నారు. అదే తరహాలో సమంత సైతం ప్రయత్నించినా, సీన్ రివర్స్ కావడంతో టెన్షన్ పడుతోందట. అలాంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టే సత్తా తనకుందా? అన్న సందేహంలో సమంత ఉండిపోయిందని అంటున్నారు. ఇటీవలే అలాంటి చిత్రం ఒకటి తనవద్దకు వస్తే ‘సారీ’ చెప్పేసిందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.