టెంపర్ పెంచుతున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్-పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన టెంపర్ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. వరుసగా ఫ్లాప్‌లతో సతమతమవుతున్న ఎన్టీఆర్‌ను హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రం టెంపర్. అయితే ఈ చిత్రం రీమేక్ రూపంలో తమిళ్‌లోకి వెళ్తోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో విశాల్, రాశిఖన్నా హీరో హీరోయిన్లు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న చిత్రం బాగా వచ్చిందని చిత్రబృందం చెబుతోంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య సాగే కొన్ని సన్నివేశాలు అలరిస్తాయట. త్వరలో జరగనున్న షెడ్యూల్‌లో ఓ బీచ్ సాంగ్‌నీ చిత్రీకరించనున్నారని అంటున్నారు. ఎఆర్ మురుగదాస్ దగ్గర అసోసియేట్ దర్శకుడిగా పనిచేసిన వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘అయోగ్య’ టైటిల్‌తో చిత్రం రాబోతుంది. ఎన్టీఆర్‌కి హిట్టునిచ్చిన పోలీస్ స్టోరీ -విశాల్‌కి ఎలా వర్కవుట్ అవుతుందో చూడాలి.