ఆ వెబ్ సిరీస్‌లకు చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొమాంటిక్ కంటెంట్‌తో ఒంట్లోంచి సెగలు రప్పించడం పాశ్చాత్య వెబ్ సిరీస్‌ల శైలి. ఇదేతీరుగా అగ్గిమీద గుగ్గిలం ఫార్ములాతో వేడెక్కించేందుకు లోకల్‌గానూ సన్నాహాలు సాగుతున్నాయి. ఆల్మోస్ట్ మహేష్‌భట్ ఫార్ములాని ‘ఏక్తాకపూర్ ఫార్ములాని ఫాలో అవుతూ ప్రస్తుతం ఇండియాలోనూ వెబ్‌సిరీస్‌లు చెలరేగిపోతున్న తీరు సీబీఎఫ్‌సీలో చర్చకొచ్చింది. యువతరం ‘విశృంఖలత్వానికి అలవాటుపడే ఆస్కారం ఉన్నందున, బూతు వెబ్ సిరీస్‌లకు కళ్లెం వేసేందుకు కఠిన నియమ నిబంధనల్ని రూపొందించేందుకు సీబీఎఫ్‌సీ ప్రయత్నిస్తోంది. ఈ రోజుల్లో ప్రతిఒక్కరి కన్ను వెబ్‌సిరీస్‌లపైనే పడింది. ఆ క్రమంలోనే భవిష్యత్ వెబ్ సిరీస్‌లదేనన్న ఆసక్తికర చర్చాసాగుతోంది. దీంతో టాలీవుడ్‌కి ఈ వైరస్ బలంగానే సోకిందని తాజా సన్నివేశం చెబుతోంది. స్టార్‌డమ్ ఉన్నవాళ్లే ఈ వెబ్‌సిరీస్‌లను ఎంకరేజ్ చేస్తున్నారంటే.. ఆ వెనక ఎంత బిజినెస్ సాగనుందో అర్థంచేసుకోవాలి. మొన్నటికి మొన్న యంగ్ యమ ఎన్టీఆర్ సైతం వెబ్ సిరీస్‌లో ఛాన్సొస్తే నటించేస్తానని మాటిచ్చారు. ప్రస్తుతం నిర్మాతలు సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్- అమెజాన్‌తోనూ ఒప్పందాలు ఖరారు చేసుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. దీనివెనక వందల కోట్ల బిజినెస్ సాగే ఛాన్సుందని అంచనా వేస్తున్నారు. ఒక్కో వెబ్ సిరీస్‌కి రూ.7 కోట్లు- రూ.10 కోట్లు పెట్టేందుకు ప్రాంతీయ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. వెబ్ సిరీస్ అంటే యూనివర్సల్. ప్రపంచవ్యాప్తంగా వీక్షణ ఉంటుంది. సరిగ్గా ఇదే పాయింట్ కొత్త అవకాశాలు, దారులకు తెరతీస్తోంది. అయితే దీంతోపాటే విచ్చలవిడితనం పెట్రేగిపోయే సన్నివేశం కనిపిస్తోందన్న విమర్శలు మొదలయ్యయి. యూత్ సర్వనాశనం అవ్వడం ఖాయమని భావించి సెన్సార్ కట్ చెప్పేందుకు ప్లాన్ సిద్ధంచేస్తున్నారని సమాచారం.