కష్టమే.. కాని అసాధ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను ప్రస్తుతానికి నా గురించి, నాకు ఎదురైన అనుభవం గురించే మాట్లాడతాను. పరిశ్రమ గురించి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు. కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెట్టి నిలదొక్కుకోవడం అంత సులువు కాదు, అలాగని అసాధ్యం కూడా కాదు. అందుకు నేనే ఉదాహరణ. నిజానికి నాకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అలాగని నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే వాతావరణం ఉంటే మాత్రం వాటినీ వదులేసుకుంటూ వచ్చా

ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో దుమారం రేపుతోన్న చర్చ -కాస్టింగ్ కౌచ్. పరిశ్రమ ఎక్కడిదైనా పరాభవాలు కామనన్నట్టు -ఒక్కొక్కరుగా గొంతు విప్పుతున్నారు. మరోపక్క ‘మీ టు’ ప్రభావం సైతం ఈ తరహా చర్చకు తావిస్తోందన్న విషయాన్ని కాదనలేం. అయితే, బాలీవుడ్‌లో మాత్రం ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. కెరీర్ ఆరంభంలో ఎదురైన అనుభవాలను రోజుకోతార ప్రస్తావిస్తుంటే -పరిశ్రమలో సంచలనం రేకెత్తుతుంది. తాజాగా అటు ఉందీ అనకుండా, ఇటు లేదూ అనకుండా ‘ఉండీలేనట్టు’గా ఆదితిరావ్ హైదరి చేసిన వ్యాఖ్యలు చర్చకొస్తున్నాయి. వజీర్, పద్మావత్‌తో మెప్పించిన ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘మనంతగా మనం ఇక్కడ పని చేయడం అంత సులువేం కాదు. అలాగని అసాధ్యం కూడా కాదు’ అన్నది హైదరి తాజా వ్యాఖ్య. కెరీర్ ఆరంభంలో నాకూ ‘అలాంటి’ ఓ అనుభవం ఎదురైంది. కాకపోతే ఆ ప్రమాదం నుంచి తెలివిగా తప్పించుకున్నా. నా వ్యక్తిత్వం ముందు అవకాశాలు గొప్పవని నేననుకోలేదు. అందుకే ప్రమాదానికి దూరంగా ఉన్నా అంది హైదరి. కాస్టింగ్ కౌచ్‌మీద మాట్లాడుతున్న బ్యూటీలంతా పరిశ్రమలో అలాంటి వాతావరణం ఉందని చెబుతూనే, భయానకమైన ఎక్స్‌పీరియన్స్ తమకు ఎదురుకాలేదని చెబుతుండటం గమనార్హం. ‘నేను ప్రస్తుతానికి నా గురించి, నాకు ఎదురైన అనుభవం గురించే మాట్లాడతాను. పరిశ్రమ గురించి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు. కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెట్టి నిలదొక్కుకోవడం అంత సులువు కాదు, అలాగని అసాధ్యం కూడా కాదు. అందుకు నేనే ఉదాహరణ. నిజానికి నాకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అలాగని నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే వాతావరణం ఉంటే మాత్రం వాటినీ వదులేసుకుంటూ వచ్చా’ అంటోంది. ప్రస్తుతం హైదరికి ఎలాంటి అవకాశాలు లేవు. ఈ విషయంపైనే వ్యాఖ్యానిస్తూ ‘నావద్దకు మూడు సినిమాల డీల్ వచ్చింది. అప్పటికి నేను కొత్త. అవకాశాల వెనుక ఉద్దేశాలు మరోలా అనిపించటంతో, నా వ్యక్తిత్వంకంటే చాన్స్‌లు గొప్ప కాదనిపించింది. అక్కడినుంచి తప్పుకున్నా’ అంటూ వివరించింది హైదరి. అయితే పరిశ్రమలో మహిళలకు రక్షణ లేదన్న వ్యాఖ్యలు తాను చేయదలచుకోలేదని నిర్ద్వద్వంగా చెప్పేయడం గమనార్హం. ‘ఒకరో ఇద్దరో దౌర్భాగ్యపు పనులు చేశారని పరిశ్రమ మొత్తాన్ని ఎలా దూషిస్తాం. ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు, ఇతర పరిశ్రమల్లోనూ మహిళలు రాణించడం అంత సులువుకాదు. అలాగే అసాధ్యం కూడా కాదు’ అంటూ స్పష్టం చేసింది. మణిరత్నం ‘చెలియా’ చిత్రంతో సౌత్‌కు ఎంట్రీ ఇచ్చిన హైదరి, హీరో ధనుష్‌తో ఒక సినిమా చేస్తోంది. మంచి ఫెర్మార్మర్ అయినప్పటికీ ఎందుకు అవకాశాలు రావడం లేదన్న ప్రశ్నకు నర్మగర్భంగా ఇదే కారణం అంటూనే, నా వ్యక్తిత్వాన్ని చంపేసకుని అవకాశాలు అందుకోలేనంటోంది హైదరి. ‘అలాంటి విషయాలపై నేరుగా ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. నేనూ అంతే. కాకపోతే నాకు వచ్చే అవకాశాలు వస్తున్నాయి. అదీ మంచి దర్శకుల నుంచే. ఆ విషయాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. ‘పరిశ్రమ నన్ను ఆదరించింది. సో, వ్యతిరేకంగా మాట్లాడలేను. కానీ, ఏ పరిశ్రమలోనైనా మహిళలకు అలాంటి ఇబ్బందులు తప్పవనే అనుకుంటున్నా’ అన్నది హైదరి అభిప్రాయం.