అజ్ఞాతవాసి అలా వస్తున్నాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమిటి? పవన్ మళ్లీ సినిమా చేస్తున్నాడా? అన్న సందేహం వచ్చింది కదూ. ఔను, మీరు చదివింది నిజమే. అజ్ఞాతవాసి ఫ్లాప్ తరువాత పవన్ రాజకీయాల్లోకి దిగిపోయాడు. అప్పటినుండి ఆయన పార్టీ ప్రచార కార్యక్రమాల్లోనే ఉంటున్నాడు. అయితే సినిమాలు మొత్తం మానేస్తానని పవన్ ఎప్పుడూ చెప్పలేదు. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు రెండు చూసుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ పవన్ ప్రచారం విషయంలో ఇంకా బిజీ అయ్యాడు. అయితే పవన్ కళ్యాణ్ ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. ఈ న్యూస్ -దుబాయ్‌లో భారతీయ సినిమాలకు సెన్సార్ చేసే అధికారి ఉమైర్ సింధు ట్విట్టర్ నుంచి బయటపడింది. అయితే ఈ సినిమా 2019 ఎన్నికల తరువాత ఉంటుందన్నది అతని అంచనా. దాంతో పవన్ ఫ్యాన్స్ ‘గాల్లో తేలిపోతున్నారు’. కానీ, ఇక్కడి పరిస్థితి చూస్తుంటే పవన్ మళ్లీ సినిమాల్లోకి వచ్చినా, ఇప్పట్లో విషయమైతే కాకపోవచ్చన్నది కొందరి అభిప్రాయం. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగావున్న పవన్, ఎన్నికల అనంతరం సైతం వెంటనే సినిమాలకు వెళ్లిపోయే అవకాశం ఉండకపోవచ్చన్నది వీరి అంచనా. భిన్నమైన పరిస్థితుల్లో ఉమర్ పెట్టిన న్యూస్‌పై నెటిజన్ల నుంచి రకరకాల స్పందనలు వస్తున్నాయి. ఏది నిజమన్నది నిదానంగానే తెలియాలి.