అవగాహన లేకుండా సినిమాలు తీయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్తీ అగర్వాల్ ప్రధాన పాత్రలో రమేష్ ముగడ దర్శకత్వంలో శ్రీ బాలగణపతి ప్రొడక్షన్స్, శ్రీ సాయిదుర్గ చిత్రాలయ పతాకంపై వీర గణేష్ కర్రి, లక్ష్మీ సరోజ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆమె ఎవరు?’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత టి.రామసత్యనారాయణ మాట్లాడుతూ, చాలామంది సినిమామీద అవగాహన లేకుండా పరిశ్రమకు వచ్చి ఎలాగైనా సినిమా చేయాలన్న తపన ఖర్చుపెట్టేస్తారని, చివరికి ఆ సినిమాను విడుదల చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని, అవగాహన లేకుండా సినిమాలు చేయొద్దని ఆశిస్తున్నానని అన్నారు. దర్శకుడు రమేష్ మాట్లాడుతూ, హారర్ కామెడీ కథాంశంతో రూపొందిన సినిమా ఇదని, ఔట్‌పుట్ బాగా వచ్చిందని, ఏప్రిల్ 1న సినిమాను విడుదల చేస్తున్నామని అన్నారు. నిర్మాత వీర గణేష్ మాట్లాడుతూ, సినిమామీద అవగాహన లేకుండా పరిశ్రమకు వచ్చి ఆస్తులమ్మి ఈ సినిమా చేశానని, సినిమా ఎప్పుడో పూర్తయ్యింది కానీ విడుదల విషయంలో సమస్యలు ఎదురయ్యాయని, చిన్న సినిమా అని ఎవరూ పట్టించుకోలేదని, ప్రేక్షకులు, పరిశ్రమ పెద్దలు చిన్న సినిమాలను ఆదరించాలి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:సేనాపతి, ఎడిటింగ్:మేనగ శ్రీను, సంగీతం:చిన్నికృష్ణ, నిర్మాతలు: వీరగణేష్, లక్ష్మీ సరోజ, దర్శకత్వం: రమేష్ ముగడ.