సంచలన విశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో అజిత్ తాజా చిత్రం విశ్వాసం. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. వీరం, వేదాళం, వివేగం సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు లేకపోలేదు. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేయడంతో, సినిమా బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమా థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయని సమాచారం. అజిత్- శివ కాంబినేషన్‌పై ఉన్న నమ్మకంతో ప్రముఖ నిర్మాణ సంస్థ 50 కోట్లకు హక్కులు సొంతం చేసుకుందన్న టాక్ కోలీవుడ్‌లో ఆసక్తిరేపుతోంది. వచ్చే సంక్రాంతికి భారీస్థాయిలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.