లవ్ అంటే నేనేలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లవ్ అంటే నేనేలే -అంటూ అనగనగా ఓ ప్రేమకథ చెబుతున్నాడు హీరో విరాజ్ జె అశ్విన్. కె సతీష్‌కుమార్ సమర్పణలో టి ప్రతాప్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రిద్ధికుమార్, రాధా బంగారు హీరోయిన్లు. నిర్మాత కెఎల్‌యన్ రాజు నిర్మిస్తోన్న చిత్రానికి సంబంధించిన -లవ్ అంటే నేనేలే పాటను ఇటీవలే దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. సంగీత సాహిత్యాలు బావున్నాయంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. తమ చిత్రంలోని పాటను మణిరత్నం విడుదల చేయటంపట్ల నిర్మాత రాజు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీమణి రచించిన గీతాన్ని మలేషియా లోకేషన్లలో షూట్ చేశారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న చిత్రం, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ఈనెలలోనే సినిమా విడుదలకు ఏర్పాట్లు చేస్తన్నట్టు చిత్ర నిర్మాత వెల్లడించారు. ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాథ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) కనిపిస్తారు.