ఇప్పటికే ఆలస్యమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్వాభిమానంతో మహిళ గొంతు విప్పడం ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పటికైనా మించింది లేదు. ఈ ధైర్యాన్ని ముందుకు సాగించాలి. అందుకు సోషల్ మీడియా ఉంది’ అంటూ పిలుపినిచ్చింది బాలీవుడ్ అందగత్తె ఐశ్వర్యారాయ్. ఓ వెబ్‌పోస్ట్‌తో మాట్లాడుతూ ‘ఇది సరైన సమయమా? కాదా? అన్న సంకోచాలు పక్కనపెట్టి బాధితులు ధైర్యంగా ముందుకురావాలి’ అని కోరింది. బాలీవుడ్‌ను కుదిపేస్తున్న సెక్సువల్ హెరాస్‌మెంట్ వ్యవహారంలో బాధిత వర్గానికి టాప్‌స్టార్లు మద్దతు పలుకుతున్నారు. ఐశ్వర్య తమ మద్దతు తెలుపుతూ ‘ఈ విషయాలపై నేనెప్పుడో మాట్లాడటం మొదలుపెట్టాను. కానీ, ఇప్పుడే సావధానం పెరిగింది. ఈ క్షణాలను వదిలేయొద్దు, ముందుకు తీసుకెళ్లాలి’ అని కోరింది. మీ టూ ఉద్యమ స్ఫూర్తిగురించి ప్రస్తావించినపుడు ‘మహిళ వ్యక్తిత్వానికి సంబంధించి సమస్య తలెత్తినపుడు నేనెప్పుడూ మాట్లాడుతున్నా. గతంలో మాట్లాడాను. ఇప్పుడు మట్లాడుతున్నాను. లింగభేదం, అసమానత్వం, లైంగిక వేధింపుల వ్యవహారాలపై భవిష్యత్‌లోనూ ఇదో ధోరణి ప్రదర్శిస్తా’నని ఐశూ వ్యాఖ్యానించడం గమనార్హం.