కాన్సెప్ట్ గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినోదాత్మక చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్లో పదికాలాలు గుర్తుండిపోయే నటుడు -రాజేంద్రప్రసాద్. ఆయన తాజాగా బేవర్స్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్లుగా రమేష్ చెప్పాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శుక్రవారం విడుదలవుతుంది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ చిత్ర విశేషాలపై మీడియాతో ముచ్చటిస్తూ, 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామన్నారు. పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులూ బేవర్సేనని ఎందుకు అనాల్సి వచ్చిందో ఈ చిత్రం కాన్సెప్ట్ తో అర్థమవుతుందన్నారు.
సామాజిక స్పృహ నిండిన చిత్రంలో మంచి పాత్ర చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. నటుడిగా 41 ఏళ్ళ ప్రయాణంలో ప్రేక్షకుల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నానన్న సంతృప్తి తనకు ఉందన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించడం నటుడిగా గర్వపడుతున్నానని అన్నారు. ఓ తండ్రీ కూతురి మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే తన పాత్ర ప్రతి తండ్రికీ నచ్చుతుందన్నారు.
సునీల్ కశ్యప్ సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిందన్నారు. హీరో సంజోష్ తొలి సినిమా అయినా బాగా చేశాడని, హీరోయిన్ హర్షితకు మంచి పాత్ర దొరికిందన్నారు. బేవర్స్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆకాంక్షించారు.