క్రేజీ ఫాలోయింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జునే -హీరో. అతని ఫాలోవర్లు రెండు మిలియన్లకు చేరడంతో, అభిమానులు సంబరాలు చేస్తున్నారు. దీనిపై నిన్నటిదాకా వౌనం వహించిన బన్నీ, ఫ్యాన్స్‌నుంచి వత్తిడి పెరుగుతుండటంతో థాంక్స్ మెసేజ్ పోస్ట్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కేరళలోనూ భారీ ఫాలోయింగ్‌వున్న బన్నీ అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు. తాజా ట్రెండ్‌లో హీరో బేస్ తెలిసేది ఆన్‌లైన్‌లోనే. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్.. ఇలా రకరకాల యాప్స్‌లో ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారన్నదే హీరో బేస్‌కు లెక్కగా మారింది. సోషల్ మీడియాలో ఈ రేంజ్‌లో రచ్చచేస్తున్న అల్లు అర్జున్ తన కొత్త సినిమా విషయంలో మాత్రం ఏదీ తేల్చడంలేదు. త్రివిక్రమ్‌తో సినిమా ఉండొచ్చన్న నిన్నటి ఊహాగానాలకు దర్శకుడే తెర దించేశాడు. బన్సీతో చేయాల్సిన కథ సిద్ధంగా లేదని, సిద్ధం చేయడానికి టైం పట్టొచ్చని నర్మగర్భంగా చెప్పడం చూస్తే త్రివిక్రమ్‌తో బన్నీ చిత్రం ఇప్పట్లో లేనట్టేనని అర్థమవుతుంది. ఇంతకుముందు విక్రమ్‌కుమార్‌తో సినిమా చేయొచ్చని గట్టిగా ప్రచారం జరిగినా, ఎలాంటి అప్‌డేట్స్ బయటికి రావడం లేదు. దీంతో బన్నీ తదుపరి చిత్రం, దాని దర్శకుడిపై అల్లిబిల్లి కథనాలే వినిపిస్తున్నాయి. నా పేరు సూర్య ఫలితం, బన్నీ తదుపరి చిత్రంపై బలమైన ప్రభావానే్న చూపుతోంది.