యదార్థ సంఘటనల విశ్వామిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకిరణ్ సినిమా నిర్మిస్తున్న చిత్రం ‘విశ్వామిత్ర’. నందితారాజ్, సత్యం రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ కీలక పాత్రధారులు. రాజ్‌కిరణ్ దర్శకుడు. మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్ నిర్మాతలు. ఫణి తిరుమలశెట్టి సమర్పిస్తున్నారు. చిత్ర టీజర్‌ను నాయిక నందిత గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ కథను చాలామంది దగ్గరకు తీసుకెళ్లాను కానీ వినడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు. ఆ తరుణంలో సంకల్పబలంతో నేను రాజ్‌కిరణ్ సినిమా అనే సంస్థను మొదలుపెట్టాను. షూటింగ్ పార్ట్ అయ్యే సమయానికి అందరూ సెట్ అయ్యారు. డిసెంబర్ మొదటివారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. న్యూజిలాండ్‌లో జరిగిన యథార్థ గాథ ఇది. అమెరికాలో జరిగిన కొన్ని అంశాలనూ మిళితం చేశాం. థ్రిల్లర్ తరహా చిత్రం. కొంచెం హారర్ టచ్ ఉంటుంది. కథ వినగానే నందిత అంగీకరించారు. అశుతోష్ రాణా ఇందులో మెయిన్ విలన్‌గా నటించారన్నారు. సత్యం రాజేష్ మాట్లాడుతూ రాజ్‌కిరణ్ రెండేళ్ల క్రితం కథ చెప్పారు. పాయింట్ హిట్ పాయింట్ అన్నాను. ఆయన ఫోన్ చేసి మీరే మెయిన్ లీడ్ అన్నారు. తర్వాత ఈ స్క్రిప్ట్‌ని చాలామంది దగ్గరకు తీసుకెళ్లాం. రాజేష్ మెయిన్ లీడ్ అన్నవారు కూడా ఉన్నారు. మా నిర్మాతలు రజనీకాంత్, మాధవి నమ్మి సినిమా చేశారు. ఫణి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు అన్నారు. నందిత మాట్లాడుతూ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. కేవలం గ్యాప్‌ను ఫిలప్ చేసుకోవడం కోసం చేయలేదు. ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. స్క్రిప్ట్ నచ్చి చేశాను. అశుతోష్‌తో పనిచేయడం హ్యాపీ అనిపించింది. అందమైన థ్రిల్లర్ ఇది. వాస్తవ సంఘటనల నేపథ్యంలో సాగుతుంది అన్నారు. విద్యుల్లేఖ రామన్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, పరుచూరి వెంకటేశ్వరరావు, జీవా, రాకెట్ రాఘవ కీలక పాత్రల్లో నటించారు.