ఎన్టీఆర్‌కు హ్యాట్రిక్ హిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్, పూజాహెగ్డే జంటగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం గురువారం విడుదలై ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల్లో యునానిమస్ టాక్‌తో సూపర్‌హిట్ టాక్ అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ సంబరాలను జరుపుకున్నారు. కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ అరవింద సమేత చిత్రాన్ని నైజాంలో మేమే విడుదల చేశాం. ఎన్టీఆర్ కెరీర్‌లోనే మొదటిరోజు భారీ వసూళ్లను అందుకుంది. ఇది ఆయనకు హ్యాట్రిక్ హిట్. ఇదివరకు జనతా గ్యారేజ్, జైలవకుశ చిత్రాలను మేమే రిలీజ్ చేశాం. త్రివిక్రమ్ మాయచేశాడు. విడుదలైన ప్రతి సెంటర్‌లో అనూహ్యమైన స్పందన వస్తోంది. ఫ్యాక్షన్ చిత్రాలను ఇదివరకు చాలా చూశాం. వాటికి భిన్నంగా చాలా సెటిల్డ్‌గా తెరకెక్కించాడు త్రివిక్రమ్. ఈ దసరాకు ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు అన్నారు. సునీల్ మాట్లాడుతూ- ప్రేక్షకులకు ధన్యవాదాలు. చాలా రోజుల తరువాత మంచి పాత్ర చేశాను. అయితే నా పాత్రకు కామెడీ లేదని కొందరు అంటున్నారు. నిజానికి ఇందులో ఆ స్కోప్ తక్కువగా ఉంది. ఫ్యాక్షన్ సినిమా అంటేనే యాక్షన్ సినిమా. కానీ దాన్ని ఫ్యామిలీ సినిమా చేసేశాడు త్రివిక్రమ్ అన్నారు. తమన్ మాట్లాడుతూ- చాలా ఆనందంగా ఉంది. నాలుగేళ్ల తరువాత ఎన్టీఆర్‌తో మళ్లీ దసరాకు ఈ సినిమాతో హిట్ అందుకున్నాము. ఇదే దసరాకు ఇంతకుముందు బృందావనం చేశాను. త్రివిక్రమ్‌తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ- సినిమాకు యునానిమస్‌గా టాక్ రావడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా మాకు గౌరవం తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని ఎక్కువగా నమ్మింది ఎన్టీఆర్. తను చాలా అద్భుతంగా చేశాడు. అన్ని అంశాలు బాగా కుదిరాయి. ఒక్క ఫ్యాక్షన్ తాలూకు యుద్ధం తరువాత జరిగే పరిస్థితులు ఏంటన్న కథ ఇది. చాలామంది ఫోన్ చేసి మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల కోణంలో ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. క్లైమాక్స్ కూడా యాక్షన్‌గా కాకుండా కొత్తగా ప్లాన్ చేశాం. ఈ సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు అన్నారు.