దుల్కర్ పాత్రలో శిరీష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. బాలనటుడు భరత్ హీరో ఫ్రెండ్‌గా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దర్శకుడిగా సంజీవ్‌రెడ్డిని పరిచయం చేస్తున్న చిత్రమిది. మధుర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మధుర శ్రీ్ధర్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్‌పై యస్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రానికి ధీరజ్ మొగిలినేని సహ నిర్మాత. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఫిబ్రవరి 8న చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాతలు వెల్లడించారు. చిత్రానికి సంబంధించి వివరాలను వెల్లడిస్తూ ‘మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్‌తో నిర్మించడం హ్యాపీగా ఉంది. మలయాళంలో దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ చేస్తున్నాడు. మాస్టర్ భరత్ అల్లు శిరీష్ స్నేహితుడిగా కనిపిస్తాడు. తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో, నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ వర్క్‌ను దర్శకుడు సంజీవ్‌రెడ్డి తీర్చిదిద్దుతున్నాడు. శిరీష్ సరసన కృష్ణార్జునయుద్ధం ఫేం రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది’ అని పేర్కొన్నారు.