బ్రహ్మోత్సవం దర్శకుడితో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మోత్సవం సినిమా ఇచ్చిన పరాజయం ఆ దర్శకుడికి అవకాశాలను దూరం చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశం దక్కలేదు. ఇక్కడ అంతే మరి. సినిమా రంగంలో కేవలం సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. అందుకే ఆ దర్శకుడికి ఎవరు అవకాశం ఇవ్వలేదు. దాంతో గట్టి ప్రయత్నాలు చేసిన శ్రీకాంత్ అడ్డాల మొత్తానికి ఓ క్రేజీ హీరోని ఒప్పించాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా, నాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం నానితో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ నిర్మిస్తుంది. నానికోసం మంచి స్క్రిప్ట్ చెప్పాడట శ్రీకాంత్. అందుకే నాని కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సో త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.