నవంబర్‌లో ఇదంజగత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథానాయకుడు సుమంత్ నటిస్తున్న మరో వైవిధ్యభరితమైన చిత్రం ‘ఇదం జగత్’. అంజు కురియన్ నాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని విరాట్ ఫిల్మ్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకంపై అనీల్ శ్రీకంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీ్ధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ ప్రథమార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ- నిర్మాణానంతర పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సార్ పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. సుమంత్ కెరీర్‌లో ఇప్పటివరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. తొలిసారిగా సుమంత్ నెగెటివ్ షేడ్ వున్న పాత్రలో ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చెయ్యబోతున్నాడు. టీజర్‌కు చక్కని స్పందన వస్తోంది. పూర్తి కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. సుమంత్ పాత్ర, కథకు ఇదం జగత్ అనే టైటిల్ యాప్ట్‌గా ఉంటుంది అన్నారు. శివాజీరాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ , షఫీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:బాల్‌రెడ్డి, ఎడిటింగ్:గ్యారీ బి.హెచ్, సంగీతం:శ్రీచరణ్ పాకాల, నిర్మాతలు:జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీ్ధర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:అనీల్ శ్రీకంఠం.