హిందీ ఆర్‌ఎక్స్100 హీరో దొరికాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో కార్తికేయ, పాయల్ రాజపుట్ జంటగా కొత్త దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఎక్స్ 100 సినిమా సంచలనం రేపిన విషయం తెలిసిందే. చిన్న చిత్రంగా విడుదలై బాక్స్‌వద్ద భారీ వసూళ్లను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళంలో ఆది పినిశెట్టి రీమేక్ చేస్తుండగా, హిందీలో ఎవరు రీమేక్ చేస్తారా? అన్న ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాలో హీరో కన్ఫర్మ్ అయ్యాడు. ఆ హీరో ఎవరో కాదు, సునీల్‌శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి. ఆహాన్‌ను హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాజిద్ నడియావాలా నిర్మిస్తున్న సినిమాకు దర్శకుడు ఎవరన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే రీమేక్‌పై బి టౌన్ వర్గాల్లో ఆసక్తి ఎక్కువైంది.