దసరా రేసులో పందెంకోడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ హీరోగా విశాల్ కథానాయకుడిగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పందెం కోడి 2’. వీరి కలయికలో 13 సంవత్సరాల క్రితం వచ్చిన ‘పందెంకోడి’ విశాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సీక్వెల్ పందెం కోడి 2పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. లైట్‌హౌస్ మూవీ మేకర్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియో పతాకాలపై విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతి లాల్ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్టోబర్ 14న హైదరాబాద్‌లోని జెఆర్‌సి కనె్వషన్ సెంటర్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భం మాస్ హీరో విశాల్ మాట్లాడుతూ- నా కెరీర్‌లో పందెంకోడి చిత్రం ఎంతో ప్రత్యేకం. హీరోగా తమిళంలోనే కాదు తెలుగులోనూ ప్రేక్షకులకు నన్ను దగ్గర చేసిన చిత్రమిది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సహా అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రానికి స్వీకెల్‌ను పదమూడేళ్ల తర్వాత చేస్తున్నాను. దర్శకుడు లింగుస్వామి సినిమాను అద్భుతంగా తెరకెక్కంచారు. సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది అన్నారు. నిర్మాత ఠాగూర్ మధు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే తమిళంలో విడుదలైన పాటలకు మంచి ఆదరణ వచ్చింది. విశాల్-యువన్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. ఈ చిత్రం వారిద్దరి కాంబినేషన్‌లో మరో హిట్‌గా నిలుస్తుంది అన్నారు. కీర్తిసురేష్ అద్భుతంగా నటించారు. వరలక్ష్మి శరత్‌కుమార్ పాత్ర సినిమాలో విశాల్ పాత్రకు ధీటుగా ఉంటుంది. అంతేకాకుండా విశాల్ నటించిన 25వ చిత్రాన్ని మా బ్యానర్‌లో విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అక్టోబర్ 14న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నాం అన్నారు. దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ- పందెంకోడి తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ తప్పకుండా అందర్నీ అలరిస్తుంది. విభిన్న కథాంశం, డిఫరెంట్‌గా సాగే హీరో క్యారెక్టరైజేషన్, థ్రిల్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్... ఇలా ఒక కమర్షియల్ చిత్రంలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ పందెంకోడిలో ఉన్నాయన్నారు.