మళ్లీ సూర్యతో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ దర్శకుడు హరి మరియు విలక్షణ నటుడు సూర్య కాంబినేషన్ అంటే అటు తమిళమే కాదు ఇటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింగం సిరీస్ చిత్రాలే అందుకు నిదర్శనం. దానికితోడు ఫాన్స్ సూర్యని ఎలా చూడాలనుకుంటారో అంతకుమించి పవర్‌ఫుల్‌గా సూర్యని పోలీసు పాత్రలో చూపిస్తాడు హరి. కాగా దర్శకుడు హరి ఇటీవలే చియాన్ వికమ్‌తో సామి చిత్రానికి సీక్వెల్‌గా సామి స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాగా తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం హరి తన తర్వాతి ప్రాజెక్ట్‌కు సంబంధించిన లైన్‌ను సూర్యకి చెప్పాడట. సూర్య కూడా హరి చెప్పిన పాయింట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి హరి ఈసారి హిట్ కొట్టాలనే కసిమీద ఉన్నాడట. పైగా వీరిద్దరి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉంటాయి.