జాన్‌గా ప్రభాస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రం -సాహో. సుజిత్ దర్శకత్వంలో ఆఘమేగాల మీద షూటింగ్ జరుపుకుంటోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణతోనూ ప్రభాస్ ఓ సినిమాకు ఓకె చెప్పాడు. కంప్లీట్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ ఇటలీలో మొదలైంది. మొదటి షెడ్యూల్‌లో ప్రభాస్‌తోపాటు హీరోయిన్ పూజాహెగ్డే పాల్గొన్న కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. తదుపరి షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. అయితే సినిమా టైటిల్‌పై ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆమూర్ టైటిల్‌తో ప్రచారం జరిగింది. ఆమూర్ అంటే ఫ్రెంచ్‌లో ప్రేమ అని అర్థం. ఇది పక్కా ప్రేమకథ కాబట్టి అలాంటి టైటిల్ పెడతారని అంటున్నారు. అయితే తాజాగా మరో టైటిల్ జాన్ ప్రచారంలోకి వచ్చింది. హీరో పేరు జాన్ కాబట్టి, అదే టైటిల్ అయితే బాగుంటుందని, పైగా జాన్ సుపరిచితమైన టైటిల్ అవుతుందని సినిమా టీం అటువైపు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.