మెగా హీరోయిన్‌గా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా కోసం జోరుగా సన్నాహాలు మొదలయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో సెట్స్‌పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా రూపొందనుంది. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా నయనతార నటిస్తుందంటూ వార్తలొస్తున్నాయి. ఇప్పటికే నయనతారతో చర్చలు జరపగా ఈ సినిమా కోసం ఆమె భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. దాంతో ఆలోచనలోపడ్డ వినాయక్‌కు అనుష్క అయితే బెటర్ అనే ఆలోచన కలగడంతో వెంటనే అది చిరంజీవితో చెప్పాడట. చిరంజీవి కూడా అనుష్క హీరోయిన్‌గా నటిస్తే బావుంటుందనే ఆలోచన చెప్పినట్లు తెలిసింది. త్వరలోనే ఆమెతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అనుష్క బాహుబలి-2, సింగం-3 చిత్రాల్లో నటిస్తోంది. ఇదివరకే చిరంజీవితో స్టాలిన్‌లో ఓ ప్రత్యేక పాటలో కనబడింది. అన్నీ ఓకె అయితే చిరంజీవి సరసన హీరోయిన్‌గా అనుష్క నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.