ఆకట్టుకునే జానూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవ్ జాదవ్, పవిత్ర, బ్రమిని ప్రధాన తారాగణంగా ఎస్.జె.ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ దర్శకత్వంలో దీపక్, సోహైల్ జిలాని రూపొందిస్తున్న చిత్రం ‘జానూ నువ్వు ఎక్కడ’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ప్రియురాలి దర్శనం అద్భుత ఆనందం అంటూ అనుకునే ఓ ప్రేమికుడు కథ కథనంతో ఈ చిత్రం సాగుతుందని, ఓ అందమైన ప్రేమకథను ఫీల్‌గుడ్ మూవీగా యువతకు నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. మురళి లియోన్ అందించిన పాటలన్నీ ఇప్పటికే విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచాయని, ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను అందమైన లొకేషన్లలో చిత్రీకరించామని తెలిపారు. యువతకు నచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రాన్ని త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. రేవంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం: సురేష్.