ఇది దసరా పందెంకోడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ పందెం కోడి సీక్వెల్‌ను 25వ చిత్రంగా చేస్తున్నాడు హీరో విశాల్. అదే ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పందెంకోడి-2’. 13ఏళ్ల క్రితం విశాల్ కెరీలో బిగ్గెస్ట్ హిట్ పందెం కోడి. అదే కాంబోలో వస్తున్న పందెంకోడి-2పై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన చిత్రం టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లైట్‌హౌస్ మూవీ మేకర్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతి లాల్ గడా చిత్రాన్ని నిర్మించారు. 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో నిర్వహించారు. థియేట్రికల్ ట్రైలర్‌ను లక్ష్మీప్రసన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా కొద్దిమంది రైతులకు విశాల్ ఆర్థిక సాయం అందించారు. జాగర్లమూడి క్రిష్ ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ‘విశాల్ 25వ సినిమా పందెంకోడి-2’కి అభినందనలు. లింగుస్వామికి పెద్ద అభిమానిని. కీర్తిసురేశ్ మన అమ్మాయి. వరలక్ష్మి లుక్ చాలాబావుంది. తన కోసమైనా ఈ సినిమా చూస్తాను. పండగకి పర్‌ఫెక్ట్ మూవీ అన్నారు. క్రిష్ మాట్లాడుతూ ‘గొప్ప స్నేహితుడికి అర్థం విశాల్. నేను తనకు చాలాపెద్ద ఫ్యాన్‌ని. పురట్చి దళపతి (విప్లవ సేనానాయకుడు) అని విశాల్‌ను తమిళ ప్రేక్షకులు, అభిమానులు పిలుచుకుంటారు. ఆ పేరు పెట్టుకోవడానికి విశాల్‌కు అర్హత ఉంది. గొప్ప పర్సనాలిటీ. మంచి హృదయమున్న వ్యక్తి. పందెంకోడిని జికె రెడ్డి, విక్రమ్ కృష్ణ నిర్మించారు. తెలుగులో పెద్ద హిట్టయ్యింది. అప్పటినుండి అందరూ విశాల్ సినిమాలను ఫాలో అవుతూనే ఉన్నారు. ఇక లింగుస్వామి గురించి చెప్పక్కర్లేదు. రెసీగా, యాక్షన్ ఫిలిమ్స్‌ను గొప్పగా అందించే దర్శకుడు. ఈ సినిమా ‘పందెంకోడి’ కన్నా రెండింతలు పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’ అన్నారు. హీరోయిన్ కీర్తిసురేశ్ మాట్లాడుతూ ‘నాపై నమ్మకంతో మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడికి థాంక్స్. వరలక్ష్మి గ్రేట్ పెర్‌ఫార్మర్’ అన్నారు. హీరో విశాల్ మాట్లాడుతూ ‘నాన్న జికె రెడ్డి, అన్నయ్య విక్రమ్‌కృష్ణ వల్లే నటుడిగా మీముందు నిలబడ్డాను. ఇది నా 25వ సినిమా. పందెంకోడి నా రెండో సినిమా. మామూలు హీరోని యాక్షన్ హీరోగా నిలబెట్టిన సినిమా అది. పందెంకోడి ప్రారంభించేముందు నేను 25 సినిమాలు చేస్తానని అనుకోలేదు. మళ్లీ నేను, లింగుస్వామి కలిసి 13 ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా పందెంకోడి-2 చేయడం నిజంగా దేవుడి ఆశీర్వాదమే. సినిమాలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, కీర్తిసురేశ్, వరలక్ష్మిలకూ అంతే ప్రాముఖ్యత ఉంది. యువన్ నా సోదరుడు లాంటివాడు. తను ప్రతిసారీ మంచి సంగీతం ఇచ్చాడు. నేను మరో 25 సినిమాలు చేసేలా 25వ సినిమా పందెంకోడి-2 ఉంటుంది. పందెంకోడి-3 చేయడానికి మళ్లీ 13 ఏళ్లు టైం తీసుకోకుండా, 13 నెలల్లో ప్రారంభమవుతుందనే నమ్మకం ఉంది. వరలక్ష్మికి ఇప్పుడు సమయం వచ్చింది. తను అద్భుతంగా పెర్‌ఫార్మ్ చేసింది. అలాగే కీర్తిరూపంలో నాకొక మంచి ఫ్రెండ్ దొరికారు. మా జోడీ చాలాబాగా మెప్పిస్తుంది. తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న ఠాగూర్ మధుకు థాంక్స్. ఆయన నా నెక్స్ట్ సినిమా నిర్మాత. ఈ సినిమా సమర్పకుడు. ఈనెల 18న తెలుగు, తమిళంలో సినిమాను విడుదల చేస్తున్నాం. అభిమన్యుడు సమయంలో ఓ విషయం చెప్పాను. ఆ మాటను ఈరోజు నెరవేర్చుకుంటున్నాను. ప్రభుత్వం తలచుకుంటే ఏమైనా చేయగలదు, కానీ రైతులు కష్టబడుతూనే ఉన్నారు. నేను బతికి ఉన్నంతవరకూ ఏదోకవిధంగా రైతులకు మంచి చేయాలని సంకల్పించాను. వాళ్లకోసమైనా ఎక్కువ సినిమాలు చేస్తాను. నా ప్రతి సినిమా టికెట్‌పై రూపాయి రైతులదే. నాకు థియేటర్ గుడి. ప్రేక్షకులే దేవుళ్లు’ అని హీరో విశాల్ అన్నారు.