ప్రేమ అంత ఈజీ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేష్‌కుమార్, ప్రజ్వల్ పువియా జంటగా ఈశ్వర్ దర్శకత్వంలో నరేష్‌కుమార్, శ్రీ్ధర్ నిర్మిస్తున్న చిత్రం ప్రేమ అంత ఈజీ కాదు. సినిమా ట్రైలర్ లాంచ్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు ఈశ్వర్ మాట్లాడుతూ ప్రేమ అంత సులువుకాదన్న విషయం ప్రేమలో పడ్డవారికి బాగా తెలుసు. ఓ కుర్రాడి జీవితంలోకి ప్రేమ ఎంట్రీ ఇస్తే అతని లైఫ్ ఎలా మారింది, కోరుకున్న ప్రేమకోసం ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్న అంశంతో సినిమా ఉంటుంది. దాంతోపాటు తండ్రీ కొడుకుల అనుబంధం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే సినిమాకు నిర్మాతల సహకారం మరవలేనిది. వాళ్ళిచ్చిన సహకారంతో సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ఇది మంచి ప్రేమకథ. బొమ్మరిల్లు తరహాలో ఉంటుంది. తండ్రి మాటకోసం ఓ యువకుడు ఏంచేశాడన్న అంశంతో సినిమాను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు అన్నారు. హీరో మాట్లాడుతూ చాలాకాలంగా మంచి కథకోసం ఎదురుచూస్తున్న నాకు ఈ సినిమా దొరికింది. మా దర్శకుడు అద్భుతంగా మలిచాడు అన్నారు. హీరోయిన్ ప్రజ్వల మాట్లాడుతూ నాకు ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అన్నారు.