యాక్షన్ థ్రిల్లర్‌గా అరకు రోడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌శంకర్, నికిషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అరకు రోడ్డులో’. ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేశామని, థ్రిల్లర్ కథాంశంగా రూపొందిన ఈ చిత్రం తుది దశలో నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోందని అన్నారు. పూర్తి యాక్షన్ తరహాలో సాగే ఈ చిత్రంలో రామ్‌శంకర్ పాత్ర హైలెట్‌గా వుంటుందని, ఏప్రిల్ 15కు షూటింగ్ పూర్తిచేసి అదే నెల చివరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రామ్‌శంకర్ కెరీర్‌లో బెస్ట్‌రోల్‌గా నిలిచే ఈ చిత్రంలో అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉన్నాయని, ఒకవైపు షూటింగ్ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వారు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:రాహుల్ రాజ్, కెమెరా:జగదీష్ చీకటి, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, రచనా, దర్శకత్వం:వాసుదేవ్.

చిత్రం నికిషా పటేల్