భిన్నమైన సినిమాలు చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు సమర్పణలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలుగా రూపొందిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. దసరా సందర్భంగా అక్టోబర్ 18న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో రామ్‌తో ఇంటర్వ్యూ..
సరికొత్త కోణంలో..
ఫస్ట్‌టైమ్ ప్రసన్న రఫ్‌గా స్టోరీ చెప్పారు. అపుడు నేను సైలెంట్‌గా విన్నాను. మూడు నెలల్లో స్టోరీ డెవలప్ చేసిన తర్వాత మళ్లీ కథ చెప్పాడు. రెండోసారి చెప్పినపుడు కథని బాగా ఎంజాయ్ చేశాను. బేసిగ్గా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఇప్పటివరకూ చాలా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ వచ్చాయి. కానీ ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో సినిమా వుంటుంది. ఆ పాయింట్‌ని ఈ యాంగిల్‌లో కూడా చూడొచ్చా అనేలా స్టోరిని డెవలప్ చేశారు. విన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో.. ఫైనల్ ఔట్‌పుట్ చూసినపుడూ అంతే ఎంజాయ్ చేశాను.
క్యారెక్టర్ గురించి..
ఇందులో నాది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్ర. పల్లెటూరినుండి పట్నం వచ్చిన యువకుడిగా నటించాను. విలేజ్ అబ్బాయిలా ఐదు నిమిషాలు మాత్రమే కనపడతాను. సిటీకి వచ్చాక సాఫ్ట్‌వేర్ అబ్బాయిగా ఒక కొత్త లుక్‌లో కనబడతాను. ఇప్పటివరకూ డైరెక్టర్ చేసిన సినిమాలన్నీ మాస్ ఓరియంటెడ్. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా వుంటుంది. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు ఎమోషన్‌ని మిక్స్ చేసి తెరకెక్కించారు. ఆయన గత చిత్రాల్లో హీరో.. హీరోయిన్ తండ్రితో ఛాలెంజ్ చేసే స్టైల్లో వుంటుంది. ఈ సినిమాలో అలా కాకుండా ఎమోషనల్ కంటెంట్ వుంటుంది. డైలాగ్స్ ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా వుంటాయి.
ప్రేక్షకుడిలా..
డైరెక్టర్ త్రినాథరావు, రైటర్ ప్రసన్న మధ్య మంచి ర్యాపో ఉంది. త్రినాథరావు ఒక ఆడియన్‌లా సీన్‌ని గమనిస్తాడు. ఒక సన్నివేశం చేసేటప్పుడు నేను, డైరెక్టర్, రైటర్ డిస్కస్ చేసుకున్న తర్వాతే షూట్‌కి వెళతాం.
సక్సెస్ కోసమే..
సక్సెస్ కావాలని సినిమాలు చేయను. ప్రతి సీన్ సక్సెస్ కావాలని అనుకుంటాను. అలాంటి సమయాల్లో స్క్రిప్ట్ వర్కవుట్ అయితే సక్సెస్ అవుతాయి. సినిమా రిలీజ్ తర్వాత ఫలితాన్ని అనలైజ్ చేసుకుంటాను. నా దగ్గర వాళ్ళతో సినిమా డిస్కస్ చేస్తాను. హీరోగా ఎక్కువ సినిమాలు చేయాలనే నాకూ ఉంది. అయితే నన్ను ఎగ్జైట్ చేసే స్క్రిప్ట్స్ నాకు చాలా తక్కువగా దొరుకుతున్నాయి.
సరైన కథ కోసం..
‘రామ రామ కృష్ణ కృష్ణ’ తర్వాత దిల్ రాజుతో చేస్తున్న సినిమా ఇది. మధ్యలో ఇద్దరం కలిసి సినిమాలు చేయాలనుకున్నాం. ఇద్దరికీ సరైన స్క్రిప్ట్ దొరకలేదు. దిల్‌రాజుగారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సినిమా మేకింగ్‌లో బాగా ఇన్‌వాల్వ్ అయి సినిమా బాగా రావాలనే తపన వున్న వ్యక్తి. ప్రవీణ్ సత్తారుతో సినిమా కొన్ని కారణాలవలన ముందుకెళ్లలేదు. భవిష్యత్‌లో ఆయనతో సినిమా చేస్తాను. తదుపరి చిత్రాల గురించి అంటే.. కథలు వింటున్నాను.

-శ్రీ