స్పాంజిలాంటిదాన్ని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవిందను అదృష్టం తరుముతోంది. ఒక సెట్ నుంచి మరో సెట్‌కు పరుగులు పెట్టిస్తోంది. అటు హిందీ, ఇటు తెలుగులో పెద్ద హీరోల సరసన ఒక్కసారిగా అవకాశాలు ముప్పిరిగొనడంతో -పూజ కెరీర్ ఎక్కే ఫ్లైటు దిగే ఫ్లైటు అన్నట్టే ఉంది. రెండడుగులు వెనక్కి వేస్తే కెరీర్ ముగిసిపోయినట్టు కాదని ఈ స్కై బ్యూటీ నిరూపించే ప్రయత్నం చేస్తోంది. మిస్ యూనివర్స్ రన్నరప్ హోదాలో 2012లో స్క్రీన్‌పైకి అడుగుపెట్టినా -అరవింద అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయింది. పూజతోపాటూ అడుగుపెట్టిన హీరోయిన్లు వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్నా -మిసీస్కిన్ బ్యూటీకి మాత్రం చాన్స్‌లు దక్కలేదు. ఒకటీ అరా సినిమాలతో కెరీర్ నెట్టుకొచ్చిన పూజకు గత రెండేళ్లలో రెండు బలమైన ఎదురు దెబ్బలే తగిలాయి. అటు హిందీలో మొహెంజదారో, ఇటు తెలుగులో దువ్వాడ జగన్నాథం చిత్రాలు ఢమాల్ మనడంతో పూజ కెరీర్ ప్రశ్నార్థకమైంది. చివరకు రంగస్థలం చిత్రంలో ‘జిగేలు రాణి’ స్పెషల్ అప్పీయరెన్స్‌కూ పూజ సిద్ధమైపోయింది. అవకాశాలు చెప్పిరావన్న నానుడిని నిజం చేస్తూ -పూజకు వరుసపెట్టి పెద్ద సినిమాల్లో చాన్స్‌లు దక్కడంతో సీనే మారిపోయింది. ఈ ఏడాది ఫస్ట్ఫాలో వచ్చిన ‘సాక్ష్యం’ చిత్రంలో సౌందర్య లహరిగా అలరించిన పూజ, నిన్నటి ‘అరవింద సమేత వీరరాఘవ’లో స్టార్ హీరో జూ.ఎన్టీఆర్‌తో జోడీకట్టి మెప్పించింది. కథా ప్రాధాన్యమున్న పాత్ర ‘అరవింద’గా కనిపించిన పూజ, మరో రెండేళ్లపాటు పెద్ద ప్రాజెక్టులతో బిజీ స్టార్ అయిపోయింది. ఒకపక్క హౌస్‌ఫుల్ సిరీస్ ‘4’లో ప్రియా రాణా పాత్ర పోషిస్తున్న పూజ, మరోపక్క మహేష్ చిత్రం ‘మహర్షి’లోనూ కీలకమైన పాత్రే చేస్తోంది. పెద్ద ప్రాజెక్టులు రెండూ త్వరలో స్క్రీన్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి పూర్తికాకుండానే ప్రభాస్‌తో ‘ఆమోర్’కు సంతకం చేసిన పూజ ఇటలీ షూట్‌తో కాల్షీట్ షెడ్యూల్‌ను బిజీ చేసుకుంది. వరుసపెట్టి పెద్ద ప్రాజెక్టుల నుంచి పూజకు పిలుపొస్తుండటంతో -ఈ సీజన్‌లో తనేంటో ప్రూవ్ చేసుకుంటాన్న ధీమా వ్యక్తం చేస్తోంది ఈ ఫెయిర్‌నెస్ బ్యూటీ. వరుస చాన్స్‌లతో బిజీ అయినట్టున్నారన్న ప్రశ్నకు పూజ చెప్తోన్న సమాధానం ఇదీ. ‘వర్క్ విషయంలో నేనెప్పుడూ సీరియసే. అవకాశం వచ్చింది కదా అని ఏదోక పాత్ర చేసేయాలన్న ఆతృత నాకెప్పుడూ లేదు. నా కెరీర్ గ్రాఫ్ తక్కువే అయినా, నేను చేసిన పాత్రలన్నీ నాకు సంతృప్తి ఇచ్చినవే. ఇటీవలి కాలంలో సినిమాపట్ల నా ఆకాంక్ష మారినట్టుంది. నా ఫ్యాషన్‌కు తగిన కథా చిత్రాల్లో నటించే అవకాశం వస్తోంది అందుకే. పెద్ద దర్శకులు, పెద్ద హీరోలతో పని చేసే అవకాశం రావడం నిజంగానే అదృష్టం. త్రివిక్రమ్ శ్రీనిస్, వంశీ పైడిపల్లి, జూ. ఎన్టీఆర్, మహేష్‌బాబు, ప్రభాస్ ఇలా వీళ్లతో పని చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. సో, రోజులో చాలా భాగం, లైఫ్‌లో ఎక్కువ భాగం సినిమా సెట్స్‌పైనే అయిపోతుంది. నా యాటిట్యూడ్ స్పాంజ్ లాంటిది. దేన్నైనా సులువుగా అబ్జార్బ్ చేసుకోగలను.
సో, పెద్ద డైరెక్టర్లు, హీరోలతో పని చేస్తున్న ఎక్స్‌పీరియన్స్ నా వ్యక్తిత్వంపైనా ప్రభావం చూపి నన్ను మార్చేస్తుందేమో. ఏదేమైనా నా వర్క్ మాట్లాడాలే తప్ప, నేను కాదన్నది నేను పెట్టుకున్న నియమం’ అంటోంది ఈ పంచదార చిలక. అరవింద ఎంత ఎదిగిపోయిందో?