మెగా యాక్షన్ మొదలైనట్టే....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నెక్స్ట్ షెడ్యూల్‌ని వైజాగ్‌లో మొదలుపెట్టింది. అక్కడ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బోయపాటి సినిమాలంటే పక్కా మాస్ యాక్షన్‌తో ఉంటాయన్న విషయం తెలిసిందే. అదే శైలిలో ఇప్పుడు చరణ్‌తో యాక్షన్ చేయిస్తున్నాడు. తాజాగా షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. చరణ్ ఓ కొత్తతరహా ఆయుధంతో ప్రత్యర్థులను రఫ్ ఆడించే పనిలోకి దిగాడు. భారీ యాక్షన్ పార్ట్‌ని అక్కడ చిత్రీకరిస్తారట. తరువాత షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుపుతారని తెలిసింది. అన్ని బాగానే ఉన్నా కూడా ఈ సినిమా టైటిల్ విషయంలో ఇంకా కన్ఫ్యూజ్‌లోనే ఉన్నారట. మరోవైపు మెగా ఫాన్స్‌కూడా ఈ టైటిల్ ఎందుకు ప్రకటించడం లేదన్న అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే సినిమా వచ్చే సంక్రాంతికి అని ప్రకటించారు. ఓ వైపు ఎన్టీఆర్ బయోపిక్‌తో బాలయ్య జోరుగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ సినిమాపై భారీ అంచనాలు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. కానీ చరణ్ సినిమా విషయంలోనే టీమ్ ఎలాంటి సందడి చేయడం లేదు. ఒకవేళ సంక్రాంతికి వచ్చే ఆలోచనను విరమించుకున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో స్నేహ, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ కీరోల్స్ పోషిస్తున్నారు.