కాంచన కోసం అక్షయ్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ముని’ సిరీస్‌లో భాగంగా వచ్చిన ‘కాంచన’ తెలుగు, తమిళ భాషల్లో పెద్ద విజయం సాధించడం తెలిసిందే. కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించి తెరకెక్కించిన చిత్రం మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చాలాకాలంగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్. ఇప్పుడు కాంచన కోసం డేట్స్ సర్దుబాటు చేసుకున్నాడని సమాచారం. హిందీ రీమేక్‌కూ లారెన్స్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయట. త్వరలోనే చిత్రాన్ని సెట్స్‌మీదకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని వినికిడి.