పీరియాడిక్ కథతో...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ట్రెండ్ మార్చాడు. ఒక్క మహేషే కాదు ఇప్పుడు టాలీవుడ్‌లోని స్టార్ హీరోలంతా ట్రెండ్ మార్చేందుకు సిద్ధమయ్యారు. హీరోయిజం ఎలివేట్ చేస్తూ వంద మందిని కొట్టడం లాంటి కథలపై ఆసక్తి తగ్గించారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌కే ఇంపార్టెంట్ ఇస్తూ ఆ తరహా పాత్రల్లో నటించి అటు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేస్తున్నారు. తాజాగా రామ్‌చరణ్ రంగస్థలం లాంటి సినిమా చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు అందరు హీరోలది అదే దారిగా మారింది.
ప్రస్తుతం ఈ లిస్ట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు మహేష్. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో నటిస్తున్న మహేష్, నెక్స్ట్ సినిమా విషయంలో భిన్నమైన కానె్సప్ట్‌తో సినిమాకు ఓకే చెప్పాడట. ఈ చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరోకాదు క్రేజీ దర్శకుడు సుకుమార్. మహేష్ 26వ చిత్రంగా తెరకెక్కే ఈ సినిమా పీరియాడిక్ నేపథ్యంలో ఉంటుందట. అది ఏకాలం అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే రెండు మూడు కథలు వినిపించిన సుకుమార్‌కు, ఒక కథని ఓకే చేసాడట మహేష్. స్క్రిప్ట్ వర్క్ పూర్తికావొచ్చిన ఈ సినిమా నవంబర్ చివర్లో ప్రారంభంమయ్యే అవకాశాలు ఉన్నాయి.