అదే.. అంతరిక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తోన్న అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్ టీజర్ తేలిపోయంది. తెలుగు ఇండస్ట్రీలో తొలి స్పేస్ నేపథ్యమున్న చిత్రంగా భారీఎత్తున ప్రచారం జరుగుతున్నా, విడుదలైన టీజర్‌లో అంత పస కనిపించలేదు. స్పేస్ బేస్‌డ్ హాలీవుడ్ చిత్రాలు తెలుగు అనువాదంలోనూ రావడంతో, అవే దృశ్యాలతో విడుదలైన అంతరిక్షం టీజర్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయంది. వరుణ్‌తేజ్, అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రాన్ని ఘాజీతో జాతీయ అవార్డు అందుకున్న సంకల్ప్‌రెడ్డి తెరకెక్కిస్తుండటం తెలిసిందే. జీరో గ్రావిటీలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్పేస్ సెటప్‌లో అంతరిక్షం చిత్రాన్ని చిత్రీకరించినట్టు దర్శకుడు సంకల్ప్‌రెడ్డి చెబుతున్నా, టీజర్‌లో మాత్రం ఓ అద్భుతాన్ని చూస్తున్నామన్న భావన కనిపించక పోవడం గమనార్హం. అత్యున్నత సాంకేతిక విభాగం, హాలీవుడ్ యాక్షన్ నిపుణుల పర్యవేక్షణలో అంతరిక్షం చిత్రానికి అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారన్నది యూనిట్ చెబుతున్న మాట. అయతే, టీజర్‌లోని విజువల్ ఎఫెక్ట్స్ పూర్తిగా హాలీవుడ్ చిత్రాల నకలు భావన కలిగించింది. గ్రావిటీ, మార్టియన్, మిషన్ టు మార్స్‌లాంటి హాలీవుడ్ చిత్రాల్లోని దృశ్యాలను చూస్తున్నట్టే అనిపించింది. ఫస్ట్ ప్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థపై దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్‌రెడ్డి అంతరిక్షం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 21న విడుదల కానున్న చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి వినోదం అందిస్తుందో చూడాలి.