లవ్ టు లైఫ్ స్టోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధీర్, ఆద్యా ఠాగూర్, అదితి హీరో హీరోయిన్లుగా కార్తికేయ ఎంటర్‌టైన్‌మెంట్ తొలి చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ప్రణయ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని కార్తికేయ నిర్మిస్తున్నారు. దర్శకుడు ప్రణయ్ మాట్లాడుతూ న్యూ జనరేషన్ లవ్ అండ్ లైఫ్ స్టోరీని తెరకెక్కిస్తున్నట్టు చెప్పాడు. కొన్ని రిఫరెన్స్‌ల ఆధారంగా కథ తయారు చేసుకున్నానని, నవంబర్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు. హీరో సుధీర్ మాట్లాడుతూ టీవీ సీరియల్స్‌లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన తనకు హీరోగా తొలి చిత్రమన్నారు. ఆద్యా ఠాగూర్, అదితితో కలిసి నటించడం హ్యాపీగా ఉందని, హీరోగా మంచి బ్రేక్‌నిచ్చే సినిమా అవుతుందన్న నమ్మకాన్ని ప్రదర్శించాడు. సినిమాటోగ్రాఫర్ కుషేందర్ మాట్లాడుతూ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేయాలనుకున్న దర్శకుడు లవ్ అండ్ లైఫ్ స్టోరీని సిద్ధం చేశాడన్నారు. కథ అద్భుతంగా రావడంతో ఇదే కానె్సప్టుతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాని వివరించాడు.