కాస్టింగ్ కౌచ్... నిజంగా నిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో లైంగిక వేధింపుల వ్యవహారం ఓ రేంజ్ దుమారాన్ని రేపింది. పలువురు ప్రామినెంట్ ఆర్టిస్టులు, హీరోయిన్లు తమకెదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికంగా బహిరంగంగానే ప్రస్తావనకు తెస్తున్నారు. దాదాపుగా బాలీవుడ్‌లో ‘మీ టూ’ ఉద్యమ స్ఫూర్తి పీక్స్‌లో నడుస్తోంది. టాప్ స్టార్ హీరోయిన్లు సైతం లైంగిక వేధింపుల సంఘటనలు తమకు ఎదురుకాలేదంటూనే, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని మద్దతు పలుకుతున్నారు. అయితే తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుట్ తానూ లైంగిక వేధింపుల బాధితురాలినేనని గొంతు విప్పింది. ఈమధ్యే కార్తికేయ హీరోగా ఆర్‌ఎక్స్ 100తో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్. వైవిధ్యమైన చిత్రంగా ప్రేక్షకాదరణ పొందిన చిత్రంతో పాయల్‌కూ మంచి పేరే వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీ టూపై స్పందన కోరినపుడు.. పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉన్నమాట వాస్తవమేనని పెదవి విప్పింది. ఇటీవలే ఓ సినిమాలో తనకు అవకాశం వచ్చిందని, ఆ సినిమాకు సంబంధించిన వ్యక్తి తనను కలిసి ఆఫర్ ఓకే చేస్తే తనకేమిస్తావని అడిగాడని కుండబద్దలు కొట్టింది. దాంతో అతని చెంపలు వాయించాలన్నంత కోపం వచ్చినా, నియంత్రించుకున్నాని చెప్పుకొచ్చింది. వచ్చిన వ్యక్తికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడమే కాదు, తనకొచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని అంటోంది పాయల్. వచ్చిన వ్యక్తి ఎవరన్నది మాత్రం ఆమె బయటపెట్టలేదు. ఇక ఆర్‌ఎక్స్ 100 సినిమాలో గ్లామర్ పాత్రలో అదరగొట్టిన పాయల్‌క, తన టాలెంట్‌ను నిరూపించుకునే అవకాశాలు రావడం లేదని, అన్నీ గ్లామర్ పాత్రలే వస్తున్నాయంటూ వాపోతోంది.